Uttar pradesh: విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్,దుమ్రి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులుగ్రామస్థుల సహాయంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్రి గ్రామానికి చెందిన శివశంకర్ గుప్తా(35) భార్య ఆర్తీదేవి రోజూలాగే ఉదయం నిద్ర లేవగానే భర్త, పిల్లలకు టీ పెట్టడం కోసం ఆర్తి స్టవ్‌పై టీ పాన్ పెట్టి గ్యాస్ వెలిగించగానే మంటలు చెలరేగి సిలిండర్ పేలింది.
మంటలలో చికుక్కున్న ముగ్గురు చిన్నారులు
దీంతో మంటలు ఇంట్లోని మరో గదిలోకి వ్యాపించాయి. ఈ సమయంలో గదిలో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు ఆంచల్ (14), కుందన్ (12), సృష్టి (11) మంటల్లో చిక్కుకున్నారు. మంటలు గదిలోకి వేగంగా వ్యాపించడంతో ఎవరూ బయటకు వచ్చే అవకాశం లేదు. మంటలు అదుపులోకి వచ్చేలోపే మహిళ, చిన్నారులు తీవ్రంగా కాలిపోయారు. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది.