Page Loader
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు

వ్రాసిన వారు Stalin
May 11, 2023
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టనుంది. మూడేళ్ల డిగ్రీ కోర్సును నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. ఈ కోర్సును ఎంచకున్న వాళ్లు ఒకే సబ్జెక్టులో గ్యాడ్యుయేషన్ పూర్తి చేయవచ్చు. సింగిల్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌ విద్యార్థులు తాము ఎంచుకున్న మేజర్ సబ్జెక్టులో నిష్ణాతులుగా తయారవుతారని ప్రభుత్వం భావిస్తోంది. యూజీసీ సూచనల మేరకు 'జాతీయ విద్యా విధానం-2020'కి అనుగుణంగా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నాలుగేళ్ల ఆనర్స్ యూజీ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. నాలుగేళ్ల ఆనర్స్‌లో ఒకే మేజర్ సబ్జెక్టు, ఒక మైనర్‌ సబ్జెక్టు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

విద్య

అన్ని డిగ్రీ కోర్సులను సింగిల్-మేజర్ ప్రోగ్రామ్‌లుగా మార్చాలి: ఏపీ ఉన్నత విద్యామండలి 

2023-24 నుంచి నాలుగేళ్ల ఆనర్స్ యూజీ ప్రోగ్రామ్‌ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇది మల్టీడిసిప్లినరీ విధానమని, మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ ఆప్షన్‌లతో కూడిన సౌకర్యవంతమైన ఎంపిక-ఆధారిత క్రెడిట్ సిస్టమ్ అని, ఇది విద్యార్థులు తమ ఆసక్తికి సంబంధించిన సబ్జెక్ట్/ఫీల్డ్‌ను ఎంచుకోవడం ద్వారా వారి కెరీర్‌ను ఉత్తమంగా తీర్చి దిద్దేందుకు సాయపడుతుందని కె హేమచంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలలు-ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ సంస్థలకు ఈ రీడిజైన్ ప్రోగ్రామ్ తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు. బీఏ, బీఎస్సీతో పాటు ఇప్పటికే ఉన్న డిగ్రీ ప్రోగ్రామ్‌లను సింగిల్-మేజర్ ప్రోగ్రామ్‌లుగా మార్చాలని స్పష్టం చేశారు.