
PM Modi AC Yojana: పీఎం మోదీ ఎసీ యోజన 2025 కింద ఉచితంగా ఏసీలు.. ఇందులో నిజమెంత?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక సందేశం విపరీతంగా వైరల్ అవుతోంది. దానిలో 'పీఎం మోదీ ఎసీ యోజన 2025' పేరిట ప్రభుత్వం ఉచితంగా 5-స్టార్ ఎయిర్ కండీషనర్లను పంపిణీ చేయనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.
ఈ యోజన 2025 మే నుండి అమలులోకి వస్తుందని, ఇప్పటికే 1.5 కోట్ల ఎయిర్ కండీషనర్లు సిద్ధంగా ఉంచినట్లు ఆ మెసేజ్‌లో ఉంది.
అయితే ఈ సందేశాన్ని ప్రభుత్వ సమాచార కార్యదర్శి(PIB)ఫ్యాక్ట్ చెక్ అధికారికంగా వివరణ ఇచ్చింది.
ఈ యోజన ఫేక్ అని స్పష్టం చేశారు. 'పీఎం మోదీ ఎయిసీ యోజన 2025' అనే పేరుతో ప్రభుత్వ పథకం లేకపోవడం, ఉచితంగా 5-స్టార్ ఎయిర్ కండీషనర్లు పంపిణీ చేసే ఎలాంటి ప్రకటన కూడా చేయలేదని PIBపేర్కొంది.
Details
ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు
ఈ సందేశాలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, వారి వ్యక్తిగత వివరాలు సేకరించడానికి లేదా అనధికారిక వెబ్‌సైట్లకి ట్రాఫిక్ పంపించేందుకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
ప్రజలకు కింది సూచనలను పాటించాలి.
1. అనధికారిక లింకులను క్లిక్ చేయవద్దు.
2. వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక వెబ్‌సైట్లలో పోస్ట్ చేయవద్దు.
3. ఇలాంటి సందేశాలను పంపించకూడదు, ఏదైనా సందేహం ఉంటే అధికారిక ప్రభుత్వ వర్గాలతో పరిశీలించండి.
4. ఎప్పుడు సందేహాలు వచ్చినా తనిఖీ చేయడం మంచిది.