Free Bus Scheme: పురుషులకు ఫ్రీ బస్ జర్నీ.. నేటి నుంచే అమలు
ఈ వార్తాకథనం ఏంటి
దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 28న ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 24న సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఆమోదం లభించింది. అనంతరం శనివారం ఉత్తర్వులు జారీ చేయగా, ఆదివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. 'ఇంద్రధనస్సు' పేరిట ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Details
ఈ నాలుగు రకాల బస్సుల్లో ఉచితం
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం 'స్త్రీశక్తి' పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఇదే కేటగిరీ బస్సుల్లో ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఫ్రీ జర్నీ అమల్లోకి వచ్చింది. అయితే నాన్‌స్టాప్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్‌రాష్ట్ర బస్సుల్లో దివ్యాంగులకు ఇప్పటివరకు అమల్లో ఉన్నట్లుగానే 50 శాతం రాయితీ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే మహిళలందరికీ 'స్త్రీశక్తి' పథకం అమల్లో ఉంది. ఇప్పుడు దివ్యాంగులైన పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుంది.
Details
ఏపీలో 11 లక్షలమంది దివ్యాంగులు
ఏపీలో సుమారు 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వారికి ఈ పథకం నేటి నుంచే వర్తించనుంది. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన చేశారు. 'ఇంద్రధనస్సు' పథకం ద్వారా దివ్యాంగుల కోసం మొత్తం ఆరు పథకాలను ప్రకటించారు. వాటిలో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి కాగా, మిగతా పథకాలను దశలవారీగా అమలు చేయనున్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు టికెట్లపై 50 శాతం రాయితీ అందుబాటులో ఉండేది.
Details
ఇంధ్ర ధనస్సు కింద ఆరు పథకాలు
ఇకపై నిర్ణీత బస్సుల్లో పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదిలా ఉండగా, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ప్రస్తుతం 50 శాతం రాయితీ అమలులో ఉంది. దీంతో అక్కడ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.