
Chandrababu : ఆగస్ట్ 7 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్తు పథకం అమలు.. సీఎం చంద్రబాబు ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం వేమకుంట గ్రామానికి చెందిన వృద్ధురాలు బోయపాటి వెంకట సుబ్బమ్మ తన మనవరాలు లక్ష్మీదేవి దివ్యాంగురాలని పేర్కొంటూ.. ఆమె పింఛన్ రూ.4వేల నుంచి రూ.15వేలకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కుటుంబ పోషణ కోసం పడుతున్న కష్టాలను వివరించడంతో ముఖ్యమంత్రి ఆమెను ఓదార్చారు. అనంతరం కలెక్టర్ శ్రీధర్‌కు తగిన సూచనలు చేశారు. ఇక రాష్ట్రంలోని చేనేత మగ్గాల కలిగిన వారికి శుభవార్త అందిస్తూ.. ఈ నెల 7వ తేదీ నుంచి ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు, హ్యాండ్‌లూమ్స్‌కు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందించనున్నట్లు వివరించారు.
Details
బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు సింగపూర్ పర్యటన
జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువులో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు, బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు సింగపూర్ వెళ్లినట్లు తెలిపారు. అయితే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవేందుకు ముందుగానే తిరిగివచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏడాదికి 64 లక్షల మందికి పింఛన్ల ద్వారా రూ.33,000 కోట్ల వ్యయం జరుగుతోందని వెల్లడించారు. తాజాగా 1,08,499 మంది వితంతువులకు రూ.43.40 కోట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మహానాడు వేదికపై ఇచ్చిన హామీ మేరకు జిందాల్ కంపెనీ ద్వారా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. గండికోట ప్రాజెక్టును ఎన్టీఆర్ ప్రారంభించగా, తానే పూర్తి చేశానని తెలిపారు.
Details
తన
అలాగే హంద్రీ-నీవా ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడం జరిగినదని, గాలేరు-నగరి ప్రాజెక్టును కడప వరకు పొడిగిస్తామని చెప్పారు. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ.. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అధోగతికి నెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 95 ప్రాయోజిత పథకాలను నిలిపివేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని అన్నారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి వారి పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. ఉల్సాల అలివేలమ్మకు స్వయంగా పింఛన్ అందించారు. ఆమె ఇంట్లో చేనేత మగ్గాన్ని పరిశీలించారు.
Details
సీమ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం
పారిశ్రామికంగా సీమ అభివృద్ధికి పూర్తి ప్రణాళిక రూపొందించినట్లు సీఎం తెలిపారు. హార్టికల్చర్ హబ్‌గా మారేందుకు చర్యలు చేపట్టామన్నారు. గండికోటలో శంకుస్థాపన గండికోటలో అభివృద్ధి పనులకు రూ.78 కోట్లతో శంకుస్థాపన చేశారు. గండికోటను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈజ్ మై ట్రిప్, హిల్టన్ హోటల్స్ వంటి సంస్థలు ఏపీ టూరిజం కార్పొరేషన్‌తో రూ.500 కోట్ల ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో హోటల్స్ నిర్మాణం, సాహసక్రీడలు, జెట్ స్కీయింగ్, కయాకింగ్, హైరోప్ వంటివి ఉన్నాయి.
Details
జగన్ బస్తీలో టీడీపీ ప్రభావం పెరుగుతోంది
జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో తెదేపాకు వలసలు పెరుగుతున్నాయి. వైకాపా జిల్లా అధికార ప్రతినిధి మోడెం పుష్పనాథరెడ్డి సహా కొత్తపల్లె సర్పంచ్ ప్రసాద్ యాదవ్, పులివెందుల కౌన్సిలర్ కమలమ్మ, ఆమె భర్త శేషు తెదేపాలో చేరారు. ఆటోలో సీఎం ప్రయాణం.. జగదీష్‌కు అద్భుత అనుభవం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు డ్రైవర్ జగదీష్ ఇంటికి వెళ్లి అతని కుటుంబంతో ముచ్చటించారు. జగదీష్ నడుపుతున్న ఆటో చూసి నువ్వే నన్ను బాడుగకు తీసుకెళ్తావా? అని సరదాగా అడిగి, ఆటోలో ప్రయాణించారు. 2 కి.మీ దూరంలోని సభావేదికకు జగదీష్ ఆటోలో వెళ్లిన చంద్రబాబు, ప్రయాణానంతరం ఛార్జీ చెల్లించారు. ఉద్వేగానికి లోనైన జగదీష్ ముఖ్యమంత్రికి పాదాభివందనం చేశారు.