Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇప్పటినుండి వారికీ ఉచిత విద్యుత్
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థలకు శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించిన ప్రకారం, తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు. టీచర్స్ డే సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ప్రభుత్వానికి గురువులకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రంలోని 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా,ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ అందిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
సమాజ నిర్మాణంలో గురువులు కీలక పాత్ర
గురువులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆదర్శ ఉపాధ్యాయులను ప్రశంసిస్తూ, ఇంగ్లీష్ మీడియం పైలట్ ప్రాజెక్ట్ కోసం ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని గుర్తుచేశారు. భవిష్యత్‌లో విద్యావ్యవస్థను నైపుణ్యం ఆధారంగా అభివృద్ధి చేయాలని, విద్యార్థులను అంతర్జాతీయంగా పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.