తదుపరి వార్తా కథనం
Cyclone Montha: మొంథా తుఫాన్ బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 29, 2025
11:10 am
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సహాయాన్ని ప్రభావిత కుటుంబాలు మరియు మత్స్యకారులకు ఉచితంగా అందజేయనున్నారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ నూనె, 1 కిలో ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, 1 కిలో చక్కెర ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా, మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందజేయనున్నారు. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా ప్రక్రియలను తక్షణమే ప్రారంభించాల్సిందిగా సివిల్ సప్లైస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర కూరగాయల పంపిణీ బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్‌కు అప్పగించారు.