LOADING...
Webinar: ఐటీ ఉద్యోగాలు,నైపుణ్యాలపై ఉచిత ఆన్‌లైన్‌ వెబినార్
ఐటీ ఉద్యోగాలు,నైపుణ్యాలపై ఉచిత ఆన్‌లైన్‌ వెబినార్

Webinar: ఐటీ ఉద్యోగాలు,నైపుణ్యాలపై ఉచిత ఆన్‌లైన్‌ వెబినార్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈనాడు, కె.ఎల్‌ యూనివర్సిటీలు సంయుక్తంగా ఐటీ రంగంలోని ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాల ప్రాధాన్యంపై ఉచిత ఆన్‌లైన్‌ వెబినార్‌ నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమం అక్టోబర్‌ 12వ తేదీ (ఆదివారం) ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జూమ్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో జరగనుంది. డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు తగిన ప్రాక్టికల్‌ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే, ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలను పొందే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ ఐటీ సంస్థల హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌) నిపుణులు ఈ వెబినార్‌లో పాల్గొని పోర్ట్‌ఫోలియో తయారీ, ఇంటర్వ్యూ చిట్కాలు, రిక్రూటర్లతో నేరుగా నెట్‌వర్కింగ్‌ విధానాలు వంటి అంశాలపై వివరంగా చర్చించనున్నారు.

వివరాలు 

వెబినార్‌లో భాగస్వాములు అవ్వడానికి.. 

అదనంగా, విద్యార్థులు,తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి కూడా ఈ వెబినార్‌ వేదికగా ఉండనుంది. ఆసక్తి కలిగిన ఎవరైనా ఈ కార్యక్రమంలో ఉచితంగా పాల్గొనవచ్చు. వెబినార్‌లో భాగస్వాములు కావాలనుకునే వారు ఈ వెబ్‌లింక్‌ ద్వారా జాయిన్‌ కావచ్చు. Zoom ID: 928 2933 8275 Passcode: 955060