LOADING...
Delhi Blast: డాక్టర్‌ ఉమర్‌ నబీ మాడ్యూల్‌కు పాక్-అఫ్గాన్ హ్యాండ్లర్ల సహకారం: దిల్లీ పేలుడులో మరిన్ని వివరాలు 
దిల్లీ పేలుడులో మరిన్ని వివరాలు

Delhi Blast: డాక్టర్‌ ఉమర్‌ నబీ మాడ్యూల్‌కు పాక్-అఫ్గాన్ హ్యాండ్లర్ల సహకారం: దిల్లీ పేలుడులో మరిన్ని వివరాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో తీగ లాగే కొద్దీ విదేశీ ఉగ్ర కుట్ర డొంక కదులుతోంది. ఈ పేలుడు వెనక భారీ నెట్‌వర్క్‌ ఉందని భద్రతా సంస్థలు గుర్తించాయి. అఫ్గానిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న హ్యాండ్లర్లు ఈ ఆపరేషన్‌ను నడిపించినట్లు కూడా అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో, ఎర్రకోట పేలుడుకు (Red Fort Blast) బాధ్యులైన మాడ్యూల్‌కు వచ్చిన ఆర్థిక సహాయం, అలాగే వారు డిజిటల్‌ వేదికల్లో జరిపిన కమ్యూనికేషన్‌ పై దర్యాప్తు చేపట్టాయి.

వివరాలు 

టెలిగ్రామ్‌లో టచ్‌లో.. 

ఢిల్లీ బ్లాస్ట్‌ (Delhi Blast) కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఉగ్రవాది-డాక్టర్‌ ఉమర్‌ నబీతో పాటు మరో అనేకమంది జైషే మహ్మద్‌ ఉగ్ర మాడ్యూల్‌తో లింకులు ఉన్నట్లు పరిశోధనలో బయటపడ్డ సంగతి తెలిసిందే. వీరు ఫైజల్‌ ఇష్ఫాక్‌ భట్‌, డాక్టర్‌ ఉకాసా అనే ఇద్దరు హ్యాండ్లర్లతో తరచుగా సంబంధాలు పెట్టుకున్నారని విచారణాధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరూ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌,అఫ్గానిస్థాన్ ప్రాంతాల్లో ఉన్నట్లు నిర్ధారించబడింది. అదేవిధంగా, మూడో హ్యాండ్లర్‌ హషీమ్‌ కూడా టెర్రర్‌ మాడ్యూల్‌ సభ్యులతో టెలిగ్రామ్‌ ద్వారా నిరంతరంగా సంప్రదింపులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.