LOADING...
Sridhar Babu: జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం : మంత్రి శ్రీధర్ బాబు
జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం : మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu: జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం : మంత్రి శ్రీధర్ బాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో భారీ ఉద్యోగాల అవకాశాల కోసం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామంటూ మంత్రి శ్రీధర్‌ బాబు ప్రకటించారు. నెట్‌ జీరో కార్బన్ సిటీగా రూపకల్పన చేయనున్న ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌కు నాలుగో న్యూక్లియస్‌గా ఏర్పడనున్నదని ఆయన తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో నిర్వహించిన సెషన్‌లో మాట్లాడుతూ, 13,500 ఎకరాల్లో గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసి, మెట్రో రైలు ద్వారా ఫ్యూచర్ సిటీని అనుసంధానిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా రూపకల్పన చేయబడుతుందని మంత్రి వివరించారు.

Details

 త్వరలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం

ప్రాజెక్ట్‌లో జోన్లవారీ విభజన ద్వారా ప్రతి జోన్‌కు ప్రత్యేక ఉద్దేశ్యం ఉంటుంది. ఇందులో ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ జోన్, ఎకో టూరిజం హబ్ లాంటి విభాగాలు ఉంటాయి. విద్యాసంస్థలకు ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో ఫ్యూచర్ సిటీలో పలు వర్సిటీల ఏర్పాటుకు సంస్థలు ముందుకొచ్చాయి. త్వరలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం కానుంది. జూపార్క్ ఏర్పాటుకు వంతారాతో ఒప్పందం సిద్దం అయింది. అలాగే 400 ఎకరాల్లో డేటా సెంటర్ సిటీ నిర్మాణం కూడా జరుగుతోంది.

Advertisement