Page Loader
నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం 
నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 మీట్‌ సమావేశం; భద్రత కట్టుదిట్టం

నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం 

వ్రాసిన వారు Stalin
May 22, 2023
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 2019లో కేంద్రం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, రాష్ట్ర హోదాను రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. ముఖ్యంగా శ్రీనగర్‌లోని జీ20 సమావేశానికి వేదిక అయిన షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే రహదారిలో ఆంక్షలు విధించారు.

జీ20

సమావేశానికి చైనా దూరం

జీ20కి ప్రస్తుతం భారత్ అధ్యక్షత వహిస్తోందని జీ20 చీఫ్ కోఆర్డినేటర్ హర్ష్ వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 118 సమావేశాలు జరిగాయని అన్నారు. టూరిజంపై గతంలో జరిగిన రెండు సమావేశాలతో పోల్చితే శ్రీనగర్ సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని ఆయన అన్నారు. జీ20 సభ్య దేశాల నుంచి దాదాపు 60మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారన్నారు. శ్రీనగర్ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు సింగపూర్ నుంచి వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కశ్మీర్‌లో జీ20 సమావేశాన్ని నిర్వహించడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. సౌదీ అరేబియా ఈవెంట్ కోసం నమోదు చేసుకోలేదు. శ్రీనగర్ సమావేశానికి దూరంగా ఉండాలని టర్కీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.