Loading...
Rohtak Dhaba Murder Case: హనీట్రాప్‌తో గ్యాంగ్‌స్టర్‌కు వల.. దాబాలో నలుగురి హత్యకు స్కెచ్!
హనీట్రాప్‌తో గ్యాంగ్‌స్టర్‌కు వల.. దాబాలో నలుగురి హత్యకు స్కెచ్!

Rohtak Dhaba Murder Case: హనీట్రాప్‌తో గ్యాంగ్‌స్టర్‌కు వల.. దాబాలో నలుగురి హత్యకు స్కెచ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలోని రోహ్‌తక్‌ సమీపంలో ఓ దాబా వద్ద ఇటీవల జరిగిన నాలుగు హత్యల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిమాన్షూ బావూ గ్యాంగ్‌ సభ్యులు గురువారం మిలాన్‌ దాబా వద్ద సన్నీ రిటోలియా గ్యాంగ్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సన్నీ తప్పించుకోగా.. అతడి ముగ్గురు అనుచరులతో పాటు దాబాకు వచ్చిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ హత్యల వెనుక ఓ యువతి పాత్ర అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆమెపై దృష్టి సారించారు. సన్నీని హనీట్రాప్‌లోకి దించి షూటర్లకు అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

వివరాలు

మూడున్నర నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం

సదరు యువతి దాదాపు మూడున్నర నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సన్నీతో పరిచయం పెంచుకున్నట్లు తెలుస్తోంది.

క్రమంగా అతడితో సన్నిహితంగా మెలుగుతూ నమ్మకాన్ని సంపాదించింది. అయితే, ఆమె సన్నీ ప్రత్యర్థి హిమాన్షూ బావూ అనుచరుడు సాహిల్‌ ప్రేయసి అని పోలీసులు గుర్తించారు.

గతంలో హిమాన్షూ సోదరుడు రోహిత్‌, బంధువు భజరంగ్‌ హత్యల్లో సన్నీ పాత్ర ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సహకరిస్తే.. ఆ యువతిని అమెరికాలో స్థిరపడేలా చేస్తామని హిమాన్షూ గ్యాంగ్‌ హామీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

వివరాలు

మర్డర్‌ ప్లాన్‌ ఇలా అమలు

గురువారం ఆ యువతిని వెంటబెట్టుకుని సన్నీ తన అనుచరులు రింకూ, యశ్‌, వినీత్‌తో కలిసి మిలాన్‌ దాబాకు డిన్నర్‌కు వెళ్లాడు. అదే సమయంలో మాస్కులు ధరించిన ఐదుగురు షూటర్లు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు.

ఈ దాడిలో రింకూ, యశ్‌, వినీత్‌ అక్కడికక్కడే మరణించారు. సన్నీ మాత్రం త్రుటిలో తప్పించుకుని పారిపోయాడు.

కాల్పుల సమయంలో దాబాలో ఉన్న మరో వ్యక్తి కూడా తూటా గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. అతడు తన బంధువును కలిసేందుకు అక్కడికి వచ్చినట్లు తెలిసింది.

దాడి జరిగిన సమయంలో దాబాలో దాదాపు 50 మంది కస్టమర్లు ఉన్నారు. కాల్పులు జరుగుతున్నంతసేపు సదరు యువతి కూడా అక్కడే ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు.

ADVERTISEMENT