Loading...
Konaseema: కోనసీమ జిల్లాలో గ్యాస్‌ బ్లోఅవుట్‌.. నగరం గ్రామంలో కలకలం
కోనసీమ జిల్లాలో గ్యాస్‌ బ్లోఅవుట్‌.. నగరం గ్రామంలో కలకలం

Konaseema: కోనసీమ జిల్లాలో గ్యాస్‌ బ్లోఅవుట్‌.. నగరం గ్రామంలో కలకలం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో గ్యాస్‌ బ్లోఅవుట్‌ ఘటన కలకలం రేపింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తాడివారి మెరక వద్ద ఉన్న ఓఎన్‌జీసీ రీడ్రిల్లింగ్‌ పాయింట్‌ నుంచి సీఎన్‌జీ గ్యాస్‌ ఒక్కసారిగా లీకైంది. దీంతో గ్యాస్‌ సమీప గ్రామాల వైపు వ్యాపిస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్‌ లీకేజీ నివారణకు అధికారుల చర్యలు సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయికి చేరుకుని గ్యాస్‌ లీకేజీని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు, బ్లోఅవుట్‌ను నియంత్రించేందుకు నరసాపురం నుంచి ప్రత్యేక బ్లోఅవుట్‌ కంట్రోల్‌ బృందం నగరం గ్రామానికి బయల్దేరింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఓఎన్‌జీసీ రీడ్రిల్లింగ్‌ పాయింట్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ

వివరాలు 

మంటలు వ్యాపించకుండా ప్రత్యేక ఏర్పాట్లు

గ్యాస్‌ బావి వద్ద మంటలు చెలరేగకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

బ్లోఅవుట్‌ ప్రాంతం చుట్టూ మంటలు వ్యాపించకుండా వాటర్‌ అంబ్రెల్లా ఏర్పాటు చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో 216వ జాతీయ రహదారి బైపాస్‌పై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

గ్యాస్‌ లీకేజీని పూర్తిగా నియంత్రించేందుకు సంబంధిత బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయి.

ADVERTISEMENT