Loading...
Konaseema Gas Blowout: కోనసీమలో గ్యాస్ బ్లోఅవుట్.. అదుపులోకి లీకేజీ.. ఓఎన్‌జీసీ ప్రకటన
కోనసీమలో గ్యాస్ బ్లోఅవుట్.. అదుపులోకి లీకేజీ.. ఓఎన్‌జీసీ ప్రకటన

Konaseema Gas Blowout: కోనసీమలో గ్యాస్ బ్లోఅవుట్.. అదుపులోకి లీకేజీ.. ఓఎన్‌జీసీ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ సమీపంలో చోటుచేసుకున్న గ్యాస్ బ్లోఅవుట్ ఘటనపై ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) స్పందించింది. గ్యాస్ బావి వద్ద మంగళవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో గ్యాస్ లీక్ అయినట్లు సమాచారం అందిందని వెల్లడించింది. వెంటనే అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలోనే గ్యాస్ బ్లోఅవుట్ సంభవించినట్లు పేర్కొంది.

వివరాలు

500 మీటర్ల పరిధిలో ప్రాంతం దిగ్బంధం

గ్యాస్ లీకేజీ సమాచారం అందిన వెంటనే ఓఎన్‌జీసీ సిబ్బంది రాజమండ్రి విపత్తు నిర్వహణ బృందాన్ని అప్రమత్తం చేశారు.

ఆ బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని భద్రత, వెల్ కంట్రోల్ చర్యలు ప్రారంభించింది.

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బావి చుట్టూ 500 మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని అధికారులు దిగ్బంధించారు.

సమీప నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జాతీయ రహదారి 216పై ప్రభావితమైన మార్గంలో వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. అలాగే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు.

వివరాలు

వాటర్ బ్లాంకెట్ ఏర్పాటు

గ్యాస్ లీకేజీ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా వాటర్ బ్లాంకెట్ (నీటి పొర)ను కూడా ఏర్పాటు చేసినట్లు ఓఎన్‌జీసీ వెల్లడించింది.

సహాయక చర్యల కోసం జిల్లా యంత్రాంగం, సంబంధిత రాష్ట్ర అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది.

అదుపులోకి వచ్చిన గ్యాస్ బ్లోఅవుట్

మరోవైపు మామిడికుదురు సమీపంలో గ్యాస్ బ్లోఅవుట్ అదుపులోకి వచ్చింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బురద పంప్ చేసి షియర్ ర్యామ్ ఏర్పాటు చేయడం ద్వారా క్రమంగా గ్యాస్ లీకేజీని నియంత్రణలోకి తీసుకొచ్చారు.

ADVERTISEMENT