PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్ సీఎం వ్యంగ్యస్త్రాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా నిర్వహించే సభలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రసంగంపై వివాదం తలెత్తింది.
ప్రధానమంత్రి కార్యాలయం తన మూడు నిమిషాల ప్రసంగాన్ని కార్యక్రమం నుంచి తొలగించిందని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.
అందుకే తమ రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రోటోకాల్ ప్రకారం స్వయంగా స్వాగతం పలకలేకపోతున్నానని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.
అందుకే ప్రధాని మోదీని ట్వీట్ ద్వారా రాజస్థాన్‌కు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు అశోక్ గెహ్లాట్ తన ట్వీట్లో వ్యంగ్యంగా రాసుకొచ్చారు.
గత ఆరు నెలల్లో ప్రధాని మోదీ రాజస్థాన్‌లో పర్యటించడం ఇది 7వ సారి.
మోదీ
అశోక్ గెహ్లాట్ ఆరోపణలపై స్పందించిన పీఎంఓ
అశోక్ గెహ్లాట్ వాదనకు విరుద్ధంగా ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) స్పందించింది.
గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా గెహ్లాట్‌ను మోదీ కార్యక్రమానికి ఆహ్వానించామని, అయన ప్రసంగానికి స్లాట్ కూడా కేటాయించామని పీఎంఓ ట్వీట్ చేసింది.
మోదీ కార్యక్రమానికి గెహ్లాట్ రాలేరని ముఖ్యమంత్రి కార్యాలయం తమకు తెలియజేసినట్లు పీఎంఓ పేర్కొంది.
ఇప్పటికీ సమయం మించిపోలేదని, ఈరోజు కార్యక్రమంలో మీరు పాల్గొనచ్చని పీఎంఓ అశోక్ గెహ్లాట్ ట్వట్‌కు రీట్వీట్ చేసింది. అభివృద్ధి పనుల ఫలకంపై కూడా రాజస్థాన్ సీఎం పేరు ఉందని పీఎంఓ చెప్పింది.
పీఎంఓ ట్వీట్‌పై అశోక్ గెహ్లాట్ మరోసారి స్పందించారు. 'గౌరవనీయులైన ప్రధాన మంత్రి, మీ కార్యాలయం నా ట్వీట్‌ను గుర్తించింది. కానీ బహుశా వారికి కూడా వాస్తవాల గురించి తెలియకపోవచ్చు' వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజస్థాన్ సీఎం చేసిన ట్వీట్
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी,
— Ashok Gehlot (@ashokgehlot51) July 27, 2023
आज आप राजस्थान पधार रहे हैं। आपके कार्यालय PMO ने मेरा पूर्व निर्धारित 3 मिनट का संबोधन कार्यक्रम से हटा दिया है इसलिए मैं आपका भाषण के माध्यम से स्वागत नहीं कर सकूंगा अतः मैं इस ट्वीट के माध्यम से आपका राजस्थान में तहेदिल से स्वागत करता…
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గెహ్లాట్ ఆరోపణలపై స్పందించిన పీఎంఓ
श्री @ashokgehlot51 जी,
— PMO India (@PMOIndia) July 27, 2023
प्रोटोकॉल के अनुसार आपको विधिवत आमंत्रित किया गया था और आपका भाषण भी रखा गया था। लेकिन आपके ऑफिस ने बताया कि आप शामिल नहीं हो पाएंगे।
प्रधानमंत्री @narendramodi की पिछली यात्राओं के दौरान भी आपको हमेशा आमंत्रित किया गया है और आपकी गरिमामयी उपस्थिति भी… pic.twitter.com/6MxBLmwcWq