Page Loader
Chapata Mirchi: ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకమైన చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు! 
ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకమైన చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు!

Chapata Mirchi: ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకమైన చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2024
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేకమైన చపాట (టమాట)మిర్చికి ఏప్రిల్‌లో భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌) లభించనున్నది. ఈ గుర్తింపును పొందేందుకు రెండు సంవత్సరాల క్రితం చెన్నైలోని 'జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ ఆఫ్‌ ఇండియా'కు దరఖాస్తు చేసినట్లుగా మల్యాల జేవీఆర్‌ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.భాస్కర్‌ తెలిపారు. భారతీయ పేటెంట్‌ కార్యాలయం (ఐపీవో) ఈ దరఖాస్తును ఆమోదించిన విషయం తాజాగా వెల్లడైంది. ఈ నేపథ్యంలో చపాట మిర్చి విత్తన సేకరణ, సాగు విధానం, పంట లభ్యత, మార్కెటింగ్‌ తదితర అంశాలను 'జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ జర్నల్‌'లో ప్రచురించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై వచ్చే ఏడాది మార్చి నెల వరకు అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిశీలించిన తరువాత ఏప్రిల్‌ నెలలో భౌగోళిక గుర్తింపు రాబోతుందని తెలిపారు.