Uttar Pradesh: రక్షాబంధన్ వేళ కల్తీ దందా.. గాజియాబాద్‌లో 1000 కిలోల రసగుల్లాలు సీజ్
ఈ వార్తాకథనం ఏంటి
రక్షాబంధన్ పండగ రోజున సోదరుడి చేతికి రాఖీ కట్టి,అతడికి మిఠాయి తినిపించడం ఆనవాయితీ. దీంతో ఈ పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా స్వీట్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ పరిస్థితిని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని కల్తీ మిఠాయిల దందాకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఇలాంటి వ్యవహారం బయటపడింది. ఓగోదాంలో తయారు చేస్తున్న సుమారు 1000కిలోల నాణ్యత లేని రసగుల్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాఖీపండగను దృష్టిలో పెట్టుకుని గాజియాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గత కొన్ని రోజులుగా స్థానిక ఆహార విక్రయ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బిహారీపురా ప్రాంతంలోని ఓ గోదాంలో పెద్ద మొత్తంలో కల్తీ స్వీట్లను తయారు చేసి నిల్వ చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది.
వివరాలు
వెయ్యి కిలోల మిఠాయిలు స్వాధీనం
దీంతో వెంటనే ఆ వేర్‌హౌస్‌పై దాడి చేశారు. తనిఖీల్లో కల్తీ పన్నీర్, చక్కెర, రసాయనాలను ఉపయోగించి రసగుల్లాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
అక్కడ లభించిన కొన్ని మిఠాయిల నమూనాలను అధికారులు సేకరించి నాణ్యతను నిర్ధారించేందుకు ప్రయోగశాలకు పంపించారు.
మొత్తం వెయ్యి కిలోల మిఠాయిలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
గోదాం నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారి లైసెన్స్‌ను రద్దు చేసేందుకు ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.
వివరాలు
డైరీ ఉత్పత్తుల విక్రయ దుకాణాల్లో ఎఫ్‌డీఏ తనిఖీలు
ఇదిలా ఉండగా.. ఆగస్టు 14న కూడా గాజియాబాద్‌లోని పలు డైరీ ఉత్పత్తుల విక్రయ దుకాణాల్లో ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సోదాల్లో వివిధ దుకాణాల నుంచి 868 కిలోల కల్తీ పన్నీర్, 170 కిలోల నాణ్యత లేని కోవాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేసి వినియోగానికి పనికిరాకుండా చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
1000 కిలోల రసగుల్లాలు స్వాధీనం
VIDEO | Uttar Pradesh: Ahead of Raksha Bandhan, the Food Safety Department in Ghaziabad launched a major crackdown on food adulterators.
— Press Trust of India (@PTI_News) August 24, 2026
A departmental team raided a warehouse in Biharipura, under the Vijay Nagar police station limits, and seized nearly 10 quintals of prepared… pic.twitter.com/gFonWboCMy