YS Jagan : వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చిన అధికారి సస్పెండ్
హైదరాబాద్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును సస్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ అమ్రపాలి కాటా ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న షెడ్లను అధికారులకు తెలియజేయకుండా కూల్చివేసినందుకు హేమంత్ పై చర్యలు తీసుకున్నారు. ఆయనని జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్)కి అటాచ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. "అడ్మినిస్ట్రేటివ్ ప్రాతిపదికన, భోర్ఖడే హేమంత్ సహదేవరావు IAS (2018), జోనల్ కమిషనర్, (ఖైరతాబాద్ జోన్) గా పనిచేస్తున్నారు. GHMC తక్షణమే GHMC నుండి రిలీవ్ చేశారు.సాధారణ పరిపాలనా విభాగం (GAD) ముందు రిపోర్టు చేయాలని ఆదేశించారు.