LOADING...
Giriraj Singh: ''పందుల పెంపకం'' అంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారంటూ విపక్షాల ఆగ్రహం
ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారంటూ విపక్షాల ఆగ్రహం

Giriraj Singh: ''పందుల పెంపకం'' అంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారంటూ విపక్షాల ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో జరిగిన ఓ సమావేశంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలు ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి చేసినవేనని విపక్షాలు ఆరోపిస్తూ తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఆర్జేడీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 10న బెగుసరాయ్ జిల్లా బచ్వారా ప్రాంతంలో జరిగిన సమావేశాన్ని బీహార్ పశుసంవర్ధక శాఖ మంత్రి, బచ్వార ఎమ్మెల్యే సురేంద్ర మెహతా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌తో పాటు పలువురు సీనియర్ ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు.

వివరాలు 

ఒక వర్గాన్ని అవమానించారని ప్రతిపక్షాల విమర్శలు.. 

ఈ సమావేశంలో ప్రసంగించిన గిరిరాజ్ సింగ్,"పందులను ఏర్పాటు చేస్తే,పందులు ఉన్న చోటికి వాళ్లు రారు" అని వ్యాఖ్యానించారు. ఆయన ఎలాంటి వర్గాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, ఇస్లాంలో పంది నిషేధిత జంతువుగా ఉండటంతో ఈ వ్యాఖ్యలు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని చేసినవేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు 

బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఈ అంశం 

ఆర్జేడీ నేత మోహిత్ యాదవ్ స్పందిస్తూ, కేంద్రమంత్రి మైనారిటీ వర్గాన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుచితమని విమర్శించారు. ఇటువంటి ప్రకటనలు సమాజంలో విభేదాలు పెంచే ప్రమాదం ఉందని, సామాజిక సామరస్యానికి తీవ్రంగా హానికరమని అన్నారు. పూర్ణియా ఎంపీ పప్పూ యాదవ్ కూడా గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రెచ్చగొట్టేలా మాట్లాడారని మండిపడ్డారు. ఈ అంశం బీహార్ రాజకీయాల్లో మరింత చర్చకు దారి తీస్తోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై దుమారం.. 

Advertisement