Mann Ki Baat: స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వండి : నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఈరోజు 'మన్ కీ బాత్' 127వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ముందుగా దేశ ప్రజలకు ఛత్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ పండుగ ప్రాముఖ్యతను వివరించి, అవకాశం దొరికినవారందరూ దీనిలో పాల్గొనాలని కోరారు. ఛత్ పండుగ భారతదేశ ఐక్యతకు చిహ్నమని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ పండుగ సందర్భంగా దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఛత్ ఉత్సవం సంస్కృతి, ప్రకృతి, సమాజం మధ్య లోతైన ఐక్యతను సూచిస్తుందంటూ, ఇది భారతదేశ సామాజిక ఐక్యతకు ఇది ఒక అందమైన ఉదాహరణని 'మన్ కీ బాత్' తెలిపారు.
Details
సాయుధ దళాల విజయానికి ప్రశంసలు
అలాగే ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు సాధించిన విజయానికి ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు కురిపించారు. దేశం సాధించిన విజయం ప్రజల్లో సంతోషాన్ని నింపిందని ఆయన పేర్కొన్నారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో ప్రభుత్వం సాధించిన విజయాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని మోదీ దేశ ప్రజలందరినీ మొక్కలు నాటాలని ప్రేరేపించారు. చెట్లు, మొక్కలు ఎక్కడ ఉన్నా ప్రతి జీవి శ్రేయస్సుకు ఉపయోగపడతాయని, మన గ్రంథాలలో కూడా ఇదే విషయాన్ని వివరించినట్లు చెప్పారు. అక్టోబర్ 31న జరగనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని కూడా ప్రధాని గుర్తు చేశారు.
Details
భారతదేశాన్ని ఏకీకృతం చేయడానికి పటేల్ కృషి చేశారు
పటేల్ ఆధునిక కాలంలో దేశంలోని ప్రముఖ నాయకుల్లో ఒకరని, పరిశుభ్రత, సుపరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చారని, భారతదేశాన్ని ఏకీకృతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న నిర్వహించే ఐక్యతా పరుగు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. తద్వారా, బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరిచిన భారత జాతీయ గీతం "వందేమాతరం"ను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. 2025 నవంబర్ 7న భారతదేశం "వందేమాతరం" 150వ వేడుకల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. ఈ పాటను రచించిన బంకిం చంద్ర ఛటర్జీని ఆయన ప్రశంసించారు.