Goa night club owners: థాయిలాండ్ పారిపోయిన గోవా నైట్‌క్లబ్ యజమానులు
ఈ వార్తాకథనం ఏంటి
25 మంది మృతికి దారితీసిన గోవా నైట్‌క్లబ్ ఘటనలో కీలక నిందితులైన క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరూ థాయిలాండ్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అర్పోరాలో ఉన్న 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో ఘటన చోటుచేసుకున్న తర్వాత ఆదివారం తెల్లవారుజామునే వారు ఫుకెట్‌కు చేరుకున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ సహాయాన్ని కోరినట్లు గోవా పోలీసులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
థాయిలాండ్ పారిపోయిన గోవా నైట్‌క్లబ్ యజమానులు
Owners of #Goa nightclub where multiple people died in the fire, the #Luthra brothers have fled to Thailand.
— India With Congress (@UWCforYouth) December 8, 2025
And the irony? They escaped on an #IndiGo flight.
On a day when 100s of IndiGo flights were cancelled, their flight took off right on time.
Coincidence… or convenience? pic.twitter.com/Kyt4MFGNsY