LOADING...
Goa Fire Accident: గోవా అగ్నిప్రమాదం.. లుథ్రా బ్రదర్స్ను థాయిలాండ్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 
లుథ్రా బ్రదర్స్ను థాయిలాండ్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Goa Fire Accident: గోవా అగ్నిప్రమాదం.. లుథ్రా బ్రదర్స్ను థాయిలాండ్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రాలను గోవా పోలీసులు పట్టుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే థాయిలాండ్‌కు పరారయ్యిన లూథ్రా సోదరుల పాస్‌పోర్ట్‌లను కూడా సస్పెండ్ చేయగా, 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 10A రూల్స్ ప్రకారం విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొనింది. దీంతో లూథ్రా బ్రదర్స్ విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంది. అయితే, డిసెంబర్ 7వ తేదీన తెల్లవారుజామున 1:17 గంటలకు లూథ్రా సోదరులు విమాన టిక్కెట్లు బుక్ చేసుకొని, అదే రోజు ఉదయం 5:30 గంటలకు ఇండిగో విమానంలో థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో లూథ్రా సోదరులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

లూథ్రా బ్రదర్స్‌పై లుక్-అవుట్ నోటీసులు

ఇప్పటివరకు, గోవా పోలీసులు లూథ్రా బ్రదర్స్‌పై లుక్-అవుట్ నోటీసులు జారీ చేశారు. అలాగే, ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసుల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వారిని వెతుకుతున్నారు. నైట్‌క్లబ్ యజమానులలో ఒకరైన అజయ్ గుప్తాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతను తనను లూథ్రా సోదరుల కేవలం స్లీపింగ్ పార్టనర్ మాత్రమే అని పేర్కొన్నాడు.

Advertisement