
Godavari Floods: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీన మండలాలకు గోదావరి వరద భయం
ఈ వార్తాకథనం ఏంటి
అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలు మరోసారి 'గోదావరి వరద భయానికి' గురయ్యాయి. గడచిన రెండు నెలల్లో ఇది ఐదవసారి వరద తాకిడికి కారణమవుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా శభరి, గోదావరి నదుల వరద ప్రవాహం ఉధృతమైంది. కూనవరం వద్ద వరద స్థాయి 42.0-2 అడుగుల వద్ద, రెండవ ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉంది. కూనవరం మండలం కొండరాజుపేట ప్రాంతంలో వరద నీరు రహదారులకు చేరింది. వీఆర్ పురం మండలంలోని చింతరేవుపల్లి, తుష్టివారి గూడెం, అడవి వెంకన్న గూడెంలో రహదారులపైకి వరద నీరు చేరడంతో, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Details
రాకపోకలకు అంతరాయం
చింతూరు మండలం చూటూరు - ముకునూరు మధ్య రహదారిపై వరద నీరు చేరడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఎటపాక మండలంలోని 'నెల్లిపాక వీరాయిగూడెం' రహదారిపై వరద నీరు చేరి, గిరిజనుల ప్రయాణాలు వరద నీటిలోనే కొనసాగుతున్నాయి. నాలుగు మండలాల వ్యాప్తంగా పలు గిరిజన గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ఎటపాక మండలంలో పలు చోట్ల మిర్చిపంటలు నీట మునిగిన పరిస్థితి ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో మరోసారి వరద ఉధృతి కొనసాగుతోంది.