Page Loader
Kunal Kamra:  ముంబై పోలీసులపై వ్యంగ్య వ్యాఖ్యలు.. టైం వేస్ట్ చేయొద్దని కునాల్ కమ్రా ట్వీట్
ముంబై పోలీసులపై వ్యంగ్య వ్యాఖ్యలు.. టైం వేస్ట్ చేయొద్దని కునాల్ కమ్రా ట్వీట్

Kunal Kamra:  ముంబై పోలీసులపై వ్యంగ్య వ్యాఖ్యలు.. టైం వేస్ట్ చేయొద్దని కునాల్ కమ్రా ట్వీట్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన ముంబై పోలీసులపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సోమవారం ముంబైలోని ఆయన తల్లిదండ్రుల నివాసానికి పోలీసులు వెళ్లారు. ఈ నేపథ్యంలో కునాల్ కమ్రా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లుగా నివసించని చిరునామాకు వెళ్లి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు.. అలాగే ప్రజా ధనాన్ని వృధా చేయొద్దని 'ఎక్స్‌' (ట్విట్టర్) లో సెటైర్లు వేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కునాల్ కమ్రా ట్వీట్

వివరాలు 

శివసేనపై కునాల్ కామెంట్స్ - తీవ్ర దుమారం 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి శివసేనను చీల్చిన వ్యక్తిగా 'ద్రోహి' అంటూ కునాల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శివసేన శ్రేణుల్లో ఆగ్రహాన్ని రగిలించాయి. కునాల్ ప్రోగ్రామ్ నిర్వహించిన క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేయడమే కాకుండా, అతనిపై కేసులు నమోదు చేశారు. ముంబై పోలీస్ స్టేషన్లలో కునాల్ కమ్రా పై పలు కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరుకావాల్సిందిగా ముంబై పోలీసులు రెండు సార్లు సమన్లు జారీ చేశారు. కానీ కునాల్ కమ్రా స్పందించలేదు. చివరికి మద్రాస్ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

వివరాలు 

కునాల్ కోసం ముంబై పోలీసుల వేట 

కునాల్ కమ్రాను అరెస్టు చేయడానికి ముంబై పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని కటారియా కాలనీలో ఉన్న అతని తల్లిదండ్రుల నివాసాన్ని పోలీసులు సందర్శించారు. ముంబై పోలీసుల ఎదుట సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉన్నా, కునాల్ హాజరుకాలేదు. దీంతో పోలీసులు అతని కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి విచారణ జరిపారు. ఈ వ్యవహారంపై స్పందించిన కునాల్.. 10 ఏళ్లుగా లేని ఇంటికి వెళ్లడం అవసరమా? సమయం, ప్రజా వనరులను వృధా చేయొద్దని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కునాల్ కమ్రా పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

వివరాలు 

ప్రశాంత్ కిషోర్ మద్దతు 

కునాల్ కమ్రా వ్యాఖ్యలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ, ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. కునాల్‌కు ఎటువంటి రాజకీయ శత్రువులు లేరని ఆయన స్పష్టం చేశారు.