
Maha Kumbh Mela : కుంభ మేళాకు వెళ్తున్నారా? తెలుగు వారి కోసం పార్కింగ్ ప్రదేశాలు, రూట్ వివరాలు!
ఈ వార్తాకథనం ఏంటి
మహా కుంభమేళా 2025 కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ప్రారంభమవుతున్న ఈ మేళాకు కోట్లాదిమంది తరలివెళ్లనున్న నేపథ్యంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు లేకుండా పటిష్టమైన ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లో ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఏర్పాట్లు సంగం ప్రాంత ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ప్రవేశ మార్గం: జవహర్ లాల్ నెహ్రూ మార్గ్ (బ్లాక్ రోడ్) ద్వారా నిష్క్రమణ మార్గం: త్రివేణి మార్గ్ ద్వారా ప్రధాన స్నానోత్సవాల రోజుల్లో అక్షయవత్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తారు.
Details
2. వాహన పార్కింగ్ ప్రదేశాలు
జౌన్‌పూర్ నుంచి వచ్చే వాహనాలు చిని మిల్ పార్కింగ్, పూర్వా సుర్దాస్ పార్కింగ్, గరాపూర్ రోడ్, సామ్యామై టెంపుల్ కచార్ పార్కింగ్. భక్తులు ఓల్డ్ జీటీ రోడ్డు గుండా నడుచుకుంటూ మేళా ప్రాంతానికి చేరుకోవాలి. వారణాసి నుంచి వచ్చే వాహనాలు మహువా బాగ్ పోలీస్‌స్టేషన్ ఝుసీ పార్కింగ్, సరస్వతి పార్కింగ్, చాట్నగర్ పార్కింగ్. భక్తులు చాట్ నగర్ రోడ్డులో నడుస్తూ మేళాకు వెళ్లవచ్చు. మీర్జాపూర్ నుంచి వచ్చే వాహనాలు దేవ్రాఖ్ ఉపర్హర్ పార్కింగ్, టెంట్ సిటీ పార్కింగ్, ఒమెక్స్ సిటీ పార్కింగ్. అరైల్ బంద్ రోడ్ గుండా మేళా ప్రాంతానికి చేరుకోవచ్చు.
Details
రేవా-బండా-చిత్రకూట్ వైపు
నవప్రయాగం,అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్ పార్కింగ్, మహేవా పురబ్/ పశ్చిమ పార్కింగ్. భక్తులు రేవా రోడ్ ద్వారా మేళా ప్రాంతానికి వెళ్లవచ్చు. కాన్‌పూర్-కౌశాంబి వైపు అలహాబాద్ డిగ్రీకాలేజ్ గ్రౌండ్ పార్కింగ్, దధీకండో గ్రౌండ్ పార్కింగ్. జీటీ జవహర్ చౌరాహా గుండా ప్రవేశించవచ్చు. లక్నో-ప్రతాప్‌గఢ్ వైపు గంగేశ్వర్ మహదేవ్ కచార్ పార్కింగ్, బక్షి బంద్ కచార్ పార్కింగ్. భక్తులు నవాస్ కీ మార్గ్ గుండా సంగం చేరవచ్చు. అయోధ్య-ప్రతాప్‌గఢ్ వైపు శివ్ బాబా పార్కింగ్ వద్ద వాహనాలు నిలిపి,సంగం లోయర్ మార్గ్ గుండా ప్రవేశించవచ్చు. స్నానోత్సవాలు జనవరి 14 (మకర సంక్రాంతి), జనవరి 29 (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (బసంత్ పంచమి) ప్రధాన స్నానాల అనంతరం మేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది.