ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్: విశాఖలో హైడ్రోజన్ హబ్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ పరిసరాల్లో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు అనుమతులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు. వచ్చేవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామి సీఎండీ వెల్లడించారు. హైదరాబాద్ ఐఐసీటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ఇంధన వనరుల్లో స్వయం స్వయంసమృద్ధిని సాధించడానికి గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగపడుతుందని చెప్పారు.
5మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తే లక్ష్యం: సీఎండీ
2030 నాటికి 5మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాన్ని చేరుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎండీ వెల్లడించారు. వాస్తవానికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఎన్టీపీసీ వద్ద తగినన్ని నిధులు ఉన్నా అవసరమైన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశంలో అనుమతులు పొందిన ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని ఎన్టీపీసీ హైడ్రోజన్, రెన్యువబుల్ ఎనర్జీ జీఎం పాండా చెప్పారు. విశాఖలో హైడ్రోజన్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేసేది కూడా ఆయన పాండా వివరించారు. ఎన్టీపీసీ ప్లాంటు పక్కనే పుడిమడకరలో హైడ్రోజన్ హబ్ వస్తుందని చెప్పారు