మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా?
మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. ఈ క్రమంలో సోమవారం ప్రభుత్వం తరఫున న్యాయవాది జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. అత్యవసర జాబితా కింద ఈ కేసును విచారించాలని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. అయితే ఆంధ్రప్రదేశ్ పిటినషన్లు మార్చి 28 నుంచి విచారించనున్నట్లు బేంచ్ పేర్కొంది.
మిస్‌లేనియస్ పిటిషన్ కావడం వల్లే విచారణ ఆలస్యం
మార్చి మూడో వారంలో విశాఖపట్నంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఏపీ సచివాలయ వర్గాలు తెలిపాయి. మార్చి 22న ఉగాది సందర్భంగా వైజాగ్ నుంచి పాలన సాగించాలని జగన్ అనున్నట్లు వైసీపీ మంత్రులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మూడు రాజధానుల అంశంపై విచారణను ఏకంగా మార్చి 28కి వాయిదా వేడయంతో మరి జగన్, ముందుగా అనుకున్నట్లే ఉగాదికి వైజాగ్‌కు షిఫ్ట్ అవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఫిబ్రవరి 23న మూడు రాజధానుల పిటిషన్లను విచారిస్తామని సుప్రీంకోర్టు మొదట చెప్పింది. బుధ, గురు వారాల్ల్లో మిస్ లేనియస్ పిటిషన్లపై విచారణ నిలిపేసింది. దీంతో సోమవారం విచారణకు స్వీకరించి, వచ్చే నెలకు వాయిదా వేసింది.