LOADING...
AP Pensions: ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు శుభవార్త

AP Pensions: ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు శుభవార్త

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్‌ అందించింది. ఏడాది చివరిలో ఒకరోజు ముందే పెన్షన్‌దారులకు డబ్బులు అందజేయనున్నట్లు ప్రకటించింది. పల్నాడు జిల్లా యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్ 31వ తేదీ సంవత్సరం చివరిదినం సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పండుగలో పాల్గొననున్నారు. సాధారణంగా జనవరి 1న పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉన్నా కొత్త సంవత్సర శుభాకాంక్షలతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్లు అందజేయనుంది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు చేపట్టింది. నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

Details

లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడనున్న సీఎం

తరువాత గ్రామసభ నిర్వహిస్తారు. ఈ పర్యటనకు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావులు పర్యవేక్షణ చేస్తూ ఏర్పాట్లను సక్రమంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10:30 గంటలకు ఉండవల్లి నివాసం నుండి పల్నాడు జిల్లాకు ప్రయాణం ప్రారంభిస్తారు. 10:50 గంటలకు నరసరావుపేట మండలం యలమంద గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 11 గంటల నుండి 11:30 వరకు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 12:35 వరకు లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడుతారు.