LOADING...
AP Govt : ఏపీ రైతులకు శుభవార్త.. వారికి రూ.25 వేలు చొప్పున సాయం : మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ రైతులకు శుభవార్త.. వారికి రూ.25 వేలు చొప్పున సాయం : మంత్రి అచ్చెన్నాయుడు

AP Govt : ఏపీ రైతులకు శుభవార్త.. వారికి రూ.25 వేలు చొప్పున సాయం : మంత్రి అచ్చెన్నాయుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన మొంథా తుపాను కారణంగా విస్తృతంగా పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో, బాధిత రైతులకు నష్టపరిహారం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. తుపాను వల్ల పలు జిల్లాల్లో పంటలు పూర్తిగా నాశనం కాగా, కొన్ని ప్రాంతాల్లో స్వల్ప నష్టం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పంటల వారీగా తుపాను ప్రభావాన్ని అంచనా వేసి వివరాలను సేకరించింది. ఈ అంచనాల ప్రకారం సుమారు రూ.5,245 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. అదే సమయంలో తుపానుతో పంటలు కోల్పోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్రం చర్యలు ప్రారంభించింది.

Details

హెక్టార్ కు రూ.17వేల నుంచి 25 వేల వరకు సాయం

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివరాల ప్రకారం, రైతులకు ఇవ్వబోయే పంట నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.17వేల నుంచి రూ.25వేలకు పెంచారు. ముఖ్యంగా అరటి పంట నష్టపోయిన రైతులకు అదనంగా రూ.10వేలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు రూ.1,500 చొప్పున పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టాల అంచనాలను ఈనెల 11వ తేదీ నాటికి 100శాతం పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పంటలు, ఆస్తులు నష్టపోయాయి.

Details

కేంద్ర బృందం పర్యటన అనంతరం సాయం

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర నివేదికను సిద్ధం చేసి, కేంద్ర ప్రభుత్వానికి సహాయం కోసం వినతిపత్రం పంపింది. ఇక తుపాను నష్టాలను ప్రత్యక్షంగా అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం రాష్ట్ర పర్యటనకు సిద్ధమైంది. సోమవారం: టీం వన్ బాపట్ల జిల్లాలో, టీం టూ కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో నష్టాలను పరిశీలిస్తుంది. మంగళవారం:టీం వన్ ప్రకాశం జిల్లాలో, టీం టూ కోనసీమ జిల్లాలో పర్యటించి, పంట నష్టాలను స్వయంగా పరిశీలించడంతో పాటు తుపాను బాధిత రైతులతో నేరుగా మాట్లాడనుంది. కేంద్ర బృందం పర్యటన అనంతరం కేంద్ర సాయం కూడా లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.