AP POLYCET 2026 : ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అందుబాటులో మోడల్ పేపర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ పాలిసెట్ 2026కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న వేళ విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు (మోడల్ ప్రశ్నాపత్రాలు) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా పరీక్షా విధానం, ప్రశ్నల నమూనాపై విద్యార్థులు ముందుగానే అవగాహన పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.
Details
గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలు
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/టెక్నాలజీ డిప్లొమా కోర్సుల సీట్లను భర్తీ చేస్తారు. ఇప్పుడు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా, అధికారులు మరో సౌకర్యాన్ని కల్పించారు. విద్యార్థుల కోసం గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలు, మోడల్ ప్రశ్నాపత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని పరిశీలించడం ద్వారా పరీక్షలో వచ్చే ప్రశ్నల సరళి ఎలా ఉంటుందో విశ్లేషించుకోవచ్చు.
Details
ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు డౌన్‌లోడ్ చేసే విధానం
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ [https://polycetap.ap.gov.in/Default.aspxలోకి](https://polycetap.ap.gov.in/Default.aspxలోకి) వెళ్లాలి. 2. హోమ్‌పేజీలో ఉన్న నోటిఫికేషన్ సెక్షన్‌ను చూడాలి. 3. అక్కడ Old Question Papers లింక్ కనిపిస్తుంది. 4. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే గతంలో నిర్వహించిన పాలిసెట్ ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉంటాయి. 5. ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్ ద్వారా వాటిని సేవ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే పాలిసెట్-2026 నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 4తో ముగుస్తుంది. అప్లికేషన్ ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
Details
ఏప్రిల్ 25న పాలిసెట్ పరీక్ష
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇప్పటికే పదో తరగతి ఉత్తీర్ణులైన వారు కూడా ఈ ప్రవేశ పరీక్షకు అర్హులు. పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందే హాల్ టికెట్లను విడుదల చేస్తారు. పరీక్ష పూర్తయ్యాక ముందుగా ప్రాథమిక కీను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం తుది కీతో పాటు ఫలితాలను ప్రకటిస్తారు.