Loading...
Andhra Pradesh: ఏపీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. 17 నుంచి ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ
ఏపీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. 17 నుంచి ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ

Andhra Pradesh: ఏపీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. 17 నుంచి ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాలు, ఆధునిక బోధనా పద్ధతులపై అధ్యయనం చేయిస్తున్నారు. ఇప్పటికే 37 మంది ఉపాధ్యాయులు సింగపూర్‌లో పర్యటించగా.. తాజాగా మరో 29 మంది టీచర్లు ఫిన్లాండ్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 17 నుంచి 26 వరకు ఫిన్లాండ్‌లో పర్యటించే వారు అక్కడి విద్యా రంగంలో అనుసరిస్తున్న ఉత్తమ బోధనా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేస్తారు.

వివరాలు

బోధన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి

అనంతరం తాము నేర్చుకున్న పద్ధతులపై రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం 'అంతర్జాతీయ వృత్తిపర అభివృద్ధి కార్యక్రమం' పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

ప్రపంచస్థాయి విద్యా విధానాలు, వినూత్న బోధనా పద్ధతులను ఉపాధ్యాయులు స్వయంగా తెలుసుకోవడం ద్వారా రాష్ట్రంలో బోధన, అభ్యసన నాణ్యతను మరింత మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశం.

వివరాలు

టుర్కు విశ్వవిద్యాలయంతో కలిసి శిక్షణ

ఫిన్లాండ్‌లోని టుర్కు విశ్వవిద్యాలయం సహకారంతో పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యలో 'జాయ్‌, ప్లే' విధానాల ద్వారా బోధనపై వృత్తిపర శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ శిక్షణను మూడు దశల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటి దశ ఓరియంటేషన్‌ ఇప్పటికే పూర్తయింది.

రెండో దశలో భాగంగా 29 మంది ఉపాధ్యాయులు ఫిన్లాండ్‌కు వెళ్లి అక్కడి విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అధ్యయనం చేయనున్నారు.

మూడో దశలో ఫిన్లాండ్‌కు చెందిన నిపుణులు ఆన్‌లైన్‌ మెంటారింగ్‌ సెషన్ల ద్వారా ఉపాధ్యాయులకు నిరంతరం మార్గదర్శనం చేస్తారు.

ఈ విధంగా విదేశాల్లో నేర్చుకున్న ఉత్తమ పద్ధతులను రాష్ట్రంలోని పాఠశాలల్లో అమలు చేసి విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT