LOADING...
AP SSC Board: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. అదనంగా 7 మార్కులు
పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. అదనంగా 7 మార్కులు

AP SSC Board: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. అదనంగా 7 మార్కులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2026
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల్లో ఉన్న సాంకేతిక లోపాలు, అస్పష్టమైన ప్రశ్నల వల్ల విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎస్ఎస్‌సీ బోర్డు అదనపు మార్కుల కేటాయింపును ప్రకటించింది. బోర్డు నిపుణుల కమిటీ సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హిందీ సబ్జెక్టులో సందిగ్ధంగా ఉన్న ప్రశ్నల కారణంగా 2 మార్కులు, ఇంగ్లిష్ సబ్జెక్టులో తలెత్తిన లోపాల నేపథ్యంలో 5 మార్కులు అదనంగా ఇవ్వనున్నారు.

వివరాలు

ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసిన బోర్డు

మొత్తంగా 7 మార్కులు విద్యార్థులకు జోడించబడతాయి. ప్రశ్నలు స్పష్టంగా లేని చోట వాటిని రాసిన విద్యార్థులందరికీ ఈ అదనపు మార్కులు వర్తిస్తాయి. దీంతో ఉత్తీర్ణత శాతం పెరగడమే కాకుండా, మెరుగైన గ్రేడింగ్ సాధించేందుకు కూడా విద్యార్థులకు సాయపడుతుంది. ఇదిలా ఉండగా, మరో మూడు ప్రశ్నలపై తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, వాటిలో ఎలాంటి లోపాలు లేవని బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs) మరియు మూల్యాంకనం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఈ అదనపు మార్కుల కేటాయింపుపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement