LOADING...
Cotton farmers: పత్తి రైతులకు గుడ్‌న్యూస్..! కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకుంటే రూ.8,110
పత్తి రైతులకు గుడ్‌న్యూస్..! కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకుంటే రూ.8,110

Cotton farmers: పత్తి రైతులకు గుడ్‌న్యూస్..! కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకుంటే రూ.8,110

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

నమస్తే రైతన్నలారా! ఈ ఏడాది మీరు పత్తి సాగు చేస్తున్నారు కదా..? అయితే ఈ ముఖ్యమైన సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోండి. మద్దతు ధర (MSP) పొందేందుకు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కొత్తగా ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. పత్తి వేసిన రైతులు సెప్టెంబర్ 1 నుండి 30 వరకు ఈ యాప్‌లో తమ వివరాలను నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన వారు మాత్రమే CCI కొనుగోలు కేంద్రాల్లో తమ పత్తి పంటను అమ్మగలరు. ఈ మేరకు మార్కెటింగ్ సిబ్బందికి అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి.

Details

యాప్ వివరాలు 

ఈ యాప్‌ను ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నమోదు సమయంలో ఆధార్ కార్డు, భూమి రికార్డులు, పత్తి పంటకు సంబంధించి రెవిన్యూ శాఖ ఇచ్చిన రికార్డులు యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇలా పూర్తి చేసిన తరువాతే దేశవ్యాప్తంగా పత్తి రైతుల సంఖ్య, పంట విస్తీర్ణం వంటి వివరాలు CCI వద్ద రికార్డ్ అవుతాయి. మద్దతు ధర పొందాలంటే సెప్టెంబర్ చివరికి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం తప్పకూడదు. మద్దతు ధర: ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ. 8,110 .

Details

స్లాట్ బుకింగ్

కపాస్ కిసాన్ యాప్‌లో రిజిస్టర్ అయిన రైతులు పత్తి అమ్మే సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. అప్పుడు ఏ రోజు CCI కేంద్రానికి పత్తి తీసుకెళ్లాలో యాప్ ద్వారా సమాచారం అందుతుంది. ఈ విధానం వల్ల రైతులకు నిల్వ, లాగిస్టిక్ సమస్యలు తక్కువ అవుతాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే పత్తి పంట దొరకడం మొదలవుతుంది. అయితే ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడటం వల్ల పత్తి దిగుబడి పెరుగుతుందని రైతులు ఆశపడుతున్నారు. ఈ విధంగా కపాస్ కిసాన్ యాప్‌లో సమయానికి రిజిస్టర్ చేయడం, స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా MSP పొందడం సులభమవుతుంది.