Loading...
Manamitra WhatsApp: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్‌.. మనమిత్ర వాట్సప్‌లో దివ్యదర్శన్‌ టికెట్లు
దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్‌.. మనమిత్ర వాట్సప్‌లో దివ్యదర్శన్‌ టికెట్లు

Manamitra WhatsApp: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్‌.. మనమిత్ర వాట్సప్‌లో దివ్యదర్శన్‌ టికెట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత దుర్గాదేవి దర్శనానికి సంబంధించి రూ.1,000 రుసుముతో కూడిన దివ్యదర్శన్‌ టికెట్లు అందుబాటులో ఉన్నాయని దుర్గగుడి ఈవో శీనానాయక్‌ తెలిపారు. ః ఈ నెల 11, 12, 13తేదీల్లో దర్శనానికి సంబంధించిన టికెట్లను దేవాదాయ శాఖకు చెందిన మనమిత్ర వాట్సప్‌ సేవల ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న ఈవో కార్యాలయంలో శుక్రవారం వైదిక కమిటీ సభ్యుడు శ్రీధర్‌శాస్త్రి, ఈఈ రమాదేవితో కలిసి ఈవో మూడు రోజుల దర్శన టికెట్లను విడుదల చేశారు. సామాన్య భక్తులు ఎలాంటి సిఫారసులు లేకుండానే నేరుగా మనమిత్ర వాట్సప్‌ నంబరు 95523 00009 ద్వారా జగన్మాత దివ్యదర్శన్‌ టికెట్లను పొందే సదుపాయాన్ని దేవస్థానం కల్పించిందని వివరించారు.

వివరాలు

ప్రత్యేక స్లాట్ల కేటాయింపు

ప్రొటోకాల్‌ ప్రముఖుల దర్శనాల కోసం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 7.45 గంటల నుంచి ప్రత్యేక స్లాట్‌ను కేటాయించినట్లు తెలిపారు.

దివ్యదర్శన్‌ టికెట్లు పొందిన భక్తులను కుమ్మరిపాలెం సెంటర్‌లోని తితిదే స్థలం నుంచి దేవస్థానానికి చెందిన వాహనాల్లో ఇంద్రకీలాద్రిపై ఓం మలుపు వరకు తీసుకెళ్తారని ఈవో పేర్కొన్నారు.

దర్శనం పూర్తయిన అనంతరం భక్తులు మల్లేశ్వరాలయ మెట్ల మార్గం ద్వారా కనకదుర్గానగర్‌కు చేరుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

సామాన్య భక్తులకు సిఫారసుల అవసరం లేకుండా దర్శన టికెట్లు పొందే అవకాశం కల్పించడమే ఈ సదుపాయం ప్రధాన ఉద్దేశమని దేవస్థానం అధికారులు తెలిపారు.

ADVERTISEMENT