Loading...
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్‌ రోడ్లు.. ప్రత్యేకతలు ఇవే!
వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్‌ రోడ్లు.. ప్రత్యేకతలు ఇవే!

Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్‌ రోడ్లు.. ప్రత్యేకతలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో సరికొత్త రోడ్ల నిర్మాణానికి ఏపీసీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా గ్రీన్‌ మొబిలిటీకి పెద్దపీట వేస్తూ పాదచారులు, సైక్లిస్టుల కోసం ప్రత్యేక రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం N9 రోడ్డు సమీపంలో మోడల్‌ వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం కొనసాగుతోంది. సాధారణ నగరాల్లో మాదిరిగా కేవలం వాహనాల రాకపోకలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా.. అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో నాన్‌-మోటరైజ్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. కారు లేదా బైక్‌ లేకపోయినా ప్రజలు సురక్షితంగా ప్రయాణించేలా ఈ స్మార్ట్‌ రోడ్లను డిజైన్‌ చేస్తున్నారు.

వివరాలు

ఫుట్‌పాత్‌, సైకిల్‌ ట్రాక్‌, గ్రీన్‌ బెల్ట్

ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న ఈ స్మార్ట్‌ రోడ్లలో 3 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌, 3 మీటర్ల సైకిల్‌ ట్రాక్‌ ఉండేలా ప్రణాళిక రూపొందించారు.

వీటి మధ్య మరో 3 మీటర్ల వెడల్పుతో గ్రీన్‌ బెల్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఫుట్‌పాత్‌ను సైకిల్‌ ట్రాక్‌ కంటే కొంత ఎత్తులో ఉంచే డిజైన్‌తో పాటు.. రెండింటినీ ఒకే స్థాయిలో ఉంచే మరో డిజైన్‌ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

సైక్లిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఉండేలా సైకిల్‌ ట్రాక్‌లకు ప్రత్యేక రంగులు లేదా పిగ్మెంటేషన్‌ను ఉపయోగించనున్నారు.

దీంతో ఏది వాహనాల రహదారి, ఏది సైకిల్‌ మార్గం, ఏది పాదచారుల మార్గం అనేది స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది.

వివరాలు

డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానం

స్మార్ట్‌ రోడ్ల నిర్మాణంలో భాగంగా మరో వినూత్న విధానాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల పైన సైకిల్‌ ట్రాక్‌లను, ఐసీటీ యుటిలిటీ డక్ట్లు, సీవర్‌ లైన్ల పైన పాదచారుల మార్గాలను ఏర్పాటు చేసే విధానాన్ని పరిశీలిస్తున్నారు.

అంటే రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, పాదచారుల మార్గాలు, సైకిల్‌ ట్రాక్‌లన్నింటినీ ఒకే సమగ్ర డిజైన్‌లో ఏర్పాటు చేయనున్నారు.

ADVERTISEMENT

వివరాలు

3,200 కిలోమీటర్ల నెట్‌వర్క్

ఏపీసీఆర్డీఏ ప్రణాళిక ప్రకారం అమరావతిలో సుమారు 3,200 కిలోమీటర్ల మేర పాదచారుల మార్గాలు, సైకిల్‌ ట్రాక్‌ల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నారు.

ఈ నెట్‌వర్క్‌ను పార్కులు, ఓపెన్‌ స్పేస్‌లు, గ్రీన్‌ ఏరియాలతో అనుసంధానం చేయనున్నారు.

వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగే కొద్దీ ట్రాఫిక్‌ ఒత్తిడి, కాలుష్యం కూడా పెరిగే అవకాశం ఉండటంతో.. వీటిని తగ్గించేందుకు నడక, సైక్లింగ్‌, ప్రజా రవాణాను మిళితం చేస్తూ గ్రీన్‌ మొబిలిటీని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు

భద్రత, వెలుతురుకూ ప్రాధాన్యత

ఈ స్మార్ట్‌ రోడ్లలో అందమైన టైల్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రజల భద్రత, సరైన వెలుతురు, వర్షపు నీటి పారుదల, ట్రాఫిక్‌ నియంత్రణ వంటి అంశాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

అమరావతి మొత్తం ఈ స్మార్ట్‌ రోడ్ల నెట్‌వర్క్‌ విస్తరించినట్లయితే.. రాజధాని రూపురేఖల్లోనే కాకుండా ప్రజల ప్రయాణ విధానంలోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ADVERTISEMENT