Page Loader
ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి రైళ్లలో వాట్సాప్‌లోనే భోజనం ఆర్డర్
ఇక నుంచి రైళ్లలో వాట్సాప్‌లోనే భోజనం ఆర్డర్

ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి రైళ్లలో వాట్సాప్‌లోనే భోజనం ఆర్డర్

వ్రాసిన వారు Stalin
Feb 07, 2023
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

వినియోగదారుల సౌకర్యార్థం రైళ్లలో ఇటీవల అనేక మార్పులు తీసుకొచ్చింది భారతీయ రైల్వే. తాజాగా రైళ్లలో ప్రయాణికులు భోజన్ ఆర్డర్ చేసుకున్న పద్ధతిని మరింత సులభతరం చేసింది. వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే సేవలను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే సేవలు ప్రస్తుతం ఎంపిక చేసిన రైళ్లలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు తమ బెర్త్‌లకు ఆహారాన్ని డెలివరీ చేసేందుకు తమ వాట్సాప్ నుంచి 8750001323 నంబర్‌కు ఆర్డర్ చేస్తే సరిపోతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ చాట్ బాక్స్ ద్వారా ఇది పని చేస్తుంది.

రైల్వే

రెండు దశల్లో ఈ-కేటరింగ్ సేవలు అమలు

ఈ-కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలు చేయాలని భారతీయ రైల్వే భావించింది. మొదటి దశ ఇప్పటికే అమలులోకి వచ్చింది. మొదటి దశలో భాగంగా, ఈ- టికెట్ బుక్ చేసుకోగానే ప్రయాణికుడికి www.ecatering.irctc.co.in లింకుతో కూడిన వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఈ లింక్‌ను క్లిక్ చేసి, రైలు వెళ్లే రూట్లలోని స్టేషన్‌లోని రెస్టారెంట్ల నుంచి నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ సిబ్బంది ప్రయాణికుడి బెర్తల వద్దకు ఆర్డర్ చేసుకున్న ఆహారాన్ని చేరుస్తారు. రెండో దశలో భాగంగా ఎలాంటి లింకులు ఓపెన్ చేయకుండా వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే సేవలను ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది. నేరుగా ఈ 8750001323 నంబర్‌కు ఆర్డర్‌ను వాట్సాప్ చేస్తే సరిపోతుంది.