Page Loader
సులభంగా కాల్స్ చేసుకునే షార్ట్ కట్ ఫీచర్ పై పనిచేస్తున్న వాట్సాప్
కాలింగ్ షార్ట్‌కట్‌ ఫీచర్‌పై పనిచేస్తున్న వాట్సాప్

సులభంగా కాల్స్ చేసుకునే షార్ట్ కట్ ఫీచర్ పై పనిచేస్తున్న వాట్సాప్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 02, 2023
09:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్‌లో కాల్‌లు చేయడం మరింత సులభంగా మారబోతోంది. WABetaInfo ప్రకారం, కాలింగ్ షార్ట్‌కట్‌ ఫీచర్‌పై కంపెనీ పనిచేస్తోంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంకా అభివృద్ధిలో ఉంది. యాప్ తర్వాతి అప్డేట్ ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్ వాట్సాప్ ఉపయోగించి తరచుగా కాల్స్ చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది. కొత్త షార్ట్‌కట్ ద్వారా, కాల్ చేయడానికి ప్రతిసారీ యాప్‌ని యాక్సెస్ చేయాల్సిన బదులు వేగంగా కాల్‌ చేయచ్చు. కాల్ షార్ట్‌కట్‌ని క్రియేట్ చేయడానికి, ముందుగా వాట్సాప్‌ లో కాంటాక్ట్ లిస్ట్ నుండి కాంటాక్ట్‌ని ఎంచుకోవాలి. కాల్ షార్ట్‌కట్ సృష్టించిన తర్వాత, అది ఆటోమెటిక్ గా ఫోన్ లోని హోమ్ స్క్రీన్‌కి యాడ్ అవుతుంది.

వాట్సాప్

ప్రత్యేకించి ఒకరికే తరచుగా కాల్స్ చేసేవారికి ఈ షార్ట్ కట్ ఫీచర్ ఉపయోగపడుతుంది

ప్రత్యేకించి ఒకరికే తరచుగా కాల్స్ చేస్తే ఈ కాల్ షార్ట్‌కట్ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా కాల్స్ సులభంగా చేసే అవకాశాన్ని ఇస్తుంది. ఈ కాల్ షార్ట్‌కట్ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్ 2.23.3.15లో వస్తుంది. దీనితో పాటు మరికొన్ని ఫీచర్లపై పనిచేస్తోంది వాట్సాప్. పెద్ద సైజులో ఉన్న డాక్యుమెంట్‌లను షేర్ చేయగలగడం, డ్రాయింగ్ ఎడిటర్‌ అప్డేట్, కొత్త కెమెరా మోడ్‌ వంటి ఫీచర్లు అందులో ఉన్నాయి.