Ayodhya: రామభక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి 2 గంటల్లో 'అయోధ్య'కు చేరుకోవచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
రామ భక్తులకు శుభవార్త అందింది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు చేరుకోవడం ఇప్పుడు మరింత సులభరంగా మారింది.
హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులకు విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది.
విమానయాన శాఖ కొత్తగా ప్రకటించిన సర్వీసుల ద్వారా భక్తులు కేవలం రెండున్నర గంటల్లోనే అయోధ్య రాముని సన్నిధికి చేరుకుంటారని పేర్కొంది.
సెప్టెంబర్ 27న ప్రారంభించిన ఈ విమాన సర్వీసులు, హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిస్తాయి.
Details
ప్రయాగరాజ్, ఆగ్రాకు కూడా ప్రత్యేక విమాన సర్వీసులు
హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లాలంటే 30 గంటలు ఇబ్బంది పడుతూ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. భక్తులు త్వరగా గమ్యానికి చేరుకునే అవకాశాన్ని కల్పించింది.
ప్రత్యేకంగా హైదరాబాద్ టూ అయోధ్య సర్వీసుతో పాటు, హైదరాబాద్ టూ కాన్పూర్ కు వారానికి నాలుగు రోజుల పాటు విమానాలు అందుబాటులో ఉంటాయి.
అలాగే సెప్టెంబర్ 28 నుంచి ప్రయాగరాజ్, ఆగ్రాకు కూడా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
కేంద్ర విమానయాన శాఖ ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని భక్తులకు సూచిస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి అగర్తాల, జమ్మూకు కూడా విమానాలు అందుబాటులో ఉన్నాయి.