Kottayam: శబరిమల భక్తులకు శుభవార్త.. వర్చువల్ క్యూ బుకింగ్ ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
శబరిమల భక్తులకు శుభవార్త అందించింది కేరళ ప్రభుత్వం. రాబోయే శబరిమల మండల మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌లో భాగంగా భక్తుల సౌకర్యార్థం వర్చువల్ క్యూ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ సేవ అందుబాటులోకి రానుంది. దర్శనానికి సంబంధించి స్లాట్‌లను భక్తులు www.sabarimalaonline.org, (http://www.sabarimalaonline.org)వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ 70,000 మంది భక్తులు వర్చువల్ క్యూ వెబ్‌సైట్ ద్వారా దర్శన స్లాట్‌లను బుక్ చేసుకునే వీలు కల్పించారు. అదనంగా వండిపెరియార్ సత్రం, ఎరుమేలి, నీలక్కల్, పంబ ప్రాంతాల్లో రియల్ టైమ్ బుకింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా రోజుకు గరిష్టంగా 20వేల మంది యాత్రికులు ప్రత్యక్షంగా దర్శనానికి అనుమతించారు.
Details
రూ. 5లక్షల వరకు రక్షణ
గత సంవత్సరం వరకు యాత్రికులకు అందించిన ప్రమాద భీమా కవరేజ్ కేవలం నాలుగు జిల్లాల్లో సంభవించే ప్రమాదాలకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే, ఈసారి భీమా పరిమితి విస్తరించి, కేరళ రాష్ట్రంలో ఎక్కడైనా శబరిమల యాత్ర సమయంలో జరిగే ప్రమాదాలకు రూ. 5 లక్షల వరకు రక్షణ కల్పించారు. అదనంగా మరణించిన భక్తుల మృతదేహాలను ఇంటికి తరలించేందుకు కూడా సాయం అందించనున్నారు. కేరళ లోపల రూ. 30,000 వరకు, కేరళ వెలుపల రూ. 1 లక్ష వరకు అంబులెన్స్ ఖర్చులు భరించబడతాయి. ఈసారి భీమా కవరేజ్ పరిధిని విస్తరించి, దేవస్వం బోర్డు శాశ్వత, రోజువారీ వేతన ఉద్యోగులు, అలాగే ఇతర ప్రభుత్వ శాఖలలో పనిచేసే సిబ్బందికి కూడా ఈ ప్రయోజనాలు వర్తింపజేశారు.
Details
సహాజ మరణాలకు పరిహారం ఉండదు
గతంలో నీలక్కల్-సన్నిధానం మార్గంలో గుండెపోటు, స్ట్రోక్ వంటి అనారోగ్యాల వల్ల సంభవించిన సహజ మరణాలకు ఎటువంటి పరిహారం ఉండేది కాదు. అయితే, ఈ సంవత్సరం నుంచి యాత్రికుల సంక్షేమ నిధి ద్వారా అలాంటి సహజ మరణాలకూ రూ. 3 లక్షల ఆర్థికసాయం అందించబడుతుంది. భీమా ప్రయోజనాలు పొందాలంటే వర్చువల్ క్యూ బుకింగ్ ఐడిని ప్రాథమిక ఆధార పత్రంగా పరిగణించనున్నారు. అందువల్ల భక్తులు తప్పనిసరిగా ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను ఉపయోగించుకోవాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు సూచించింది.