LOADING...
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్‌.. రైతుల ఖాతాల్లో ఒకేసారి నగదు
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్‌.. రైతుల ఖాతాల్లో ఒకేసారి నగదు

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్‌.. రైతుల ఖాతాల్లో ఒకేసారి నగదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 19, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రైతులకు శుభవార్త అందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా నిధుల విడుదల విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై తొలి విడతలోనే అన్ని లబ్దిదారులకు డబ్బులు అందేలా కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు ఒక ఎకరం భూమి ఉన్న రైతుల నుంచి ప్రారంభించి విడతల వారీగా ఎక్కువ భూమి కలిగిన వారికి నిధులు జమ చేయడం వల్ల పెద్ద రైతులకు పెట్టుబడి సాయం ఆలస్యమయ్యేది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాత విధానానికి స్వస్తి పలికి కొత్త పద్ధతిని తీసుకువచ్చింది.

Details

రైతు ఖాతాలో ఒక ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు

కొత్త విధానం ప్రకారం రైతు వద్ద ఎంత భూమి ఉన్నా తొలి విడతలో ప్రతి రైతు ఖాతాలో ఒక ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు జమ చేస్తారు. ఉదాహరణకు ఐదు ఎకరాల భూమి ఉన్న రైతుకు మొదట రూ.6 వేలే జమ అవుతాయి. మిగిలిన ఎకరాలకు సంబంధించిన మొత్తం తరువాతి విడతల్లో అందించనున్నారు. ఈ నిర్ణయంతో అన్ని రైతులకు ఒకేసారి లబ్ధి చేకూరనుంది. ఈ నెల 22న నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో తొలి విడత నిధులను విడుదల చేయనున్నారు. మొదటి విడతలోనే సుమారు 70లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్లను జమ చేయనున్నారు. అనంతరం 20 రోజుల గ్యాప్‌తో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరుకల్లా మూడో విడత నిధులు జమ చేస్తారు.

Details

భూమి ధరణి పోర్టల్‌లో నమోదై ఉండాలి

ఈసారి మొత్తం ప్రక్రియను మూడు విడతల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రైతు భరోసా కోసం కొత్త దరఖాస్తులను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ నెల 25లోగా అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి 2026లోగా కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక రైతు వేదికలు లేదా రైతు విస్తరణ అధికారుల వద్ద అప్లికేషన్ సమర్పించాలి. దరఖాస్తు చేసేటప్పుడు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్‌తో పాటు రైతు భరోసా అప్లికేషన్ తీసుకెళ్లాలి. అలాగే భూమి ధరణి పోర్టల్‌లో నమోదై ఉండాలి మరియు అది వ్యవసాయయోగ్యమైన భూమి కావాలి.

Advertisement