LOADING...
Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవులు పొడిగింపు.. కొత్త తేదీ ఇదే!
తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవులు పొడిగింపు.. కొత్త తేదీ ఇదే!

Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవులు పొడిగింపు.. కొత్త తేదీ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2026
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని పాఠశాలల పునఃప్రారంభ తేదీని మార్చుతూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 15వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం సెలవులు రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు సౌలభ్యం దృష్ట్యా పాఠశాలల ప్రారంభ తేదీని జూన్ 15కు మార్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

వివరాలు

అధికారిక ఉత్తర్వులు జారీ

అయితే ఈ మార్పు కారణంగా కోల్పోయే విద్యా సమయాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. జూలై 11న వచ్చే రెండో శనివారాన్ని సాధారణ పనిదినంగా ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల పునఃప్రారంభ తేదీని కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 2వ తేదీన అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం కావాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సెలవులను పొడిగించింది.

వివరాలు

జూన్ 15 న ప్రారంభం 

దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు కూడా జూన్ 15వ తేదీ నుంచి యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, చిన్నారుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement