LOADING...
School Uniform : తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్కూల్ యూనిఫాంలలో కీలక మార్పులు
తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్కూల్ యూనిఫాంలలో కీలక మార్పులు

School Uniform : తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్కూల్ యూనిఫాంలలో కీలక మార్పులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త డ్రెస్ కోడ్‌ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండగా, విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే కొత్త యూనిఫాంలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత విద్యా సంవత్సరంలో అందించిన యూనిఫాంలు ఆకర్షణీయంగా లేవన్న ఫిర్యాదులు రావడంతో ఈసారి డిజైన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కొత్త యూనిఫాంలో బాలుర షర్టులు, బాలికల టాప్స్ లైట్ బ్లూ రంగులో ఉండగా, బాలుర ప్యాంట్లు, బాలికల చుడీదార్లు, స్కర్ట్లు ముదురు నీలం (డార్క్ బ్లూ) రంగులో ఉండనున్నాయి.

వివరాలు

ఆకర్షణీయమైన యూనిఫాంలను అందిచడమే ప్రభుత్వ లక్ష్యం

అంతేకాకుండా యూనిఫాం డిజైన్‌లో ప్రత్యేక మార్పులు చేశారు. బాలుర చొక్కాల ముందు జేబు, చేతులపై ముదురు నీలం రంగు పట్టీలు ఉండనున్నాయి. అలాగే బాలికల పంజాబీ డ్రెస్ చొక్కా చేతులపై, వెయిస్ట్ కోట్ భాగంలో కూడా ముదురు నీలం రంగు పట్టీలు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన యూనిఫాంలను అందించాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా ఆరో తరగతి, ఏడో తరగతి చదివే అబ్బాయిలకు ప్యాంట్లు తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement