Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. ఫార్ములా ఈ రేసింగ్‌కు మరోసారి ఆతిథ్యం
ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ-రేసింగ్‌కు మరోసారి హైదరాబాద్ వేదిక కానుంది. వచ్చే ఏడాది కూడా హైదరాబాదులోనే ఫార్ములా పోటీలు జరుగుతాయని నిర్వాహకులు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్ వేదికగా 10వ ఏబీబీ ఏఫ్ఐఏ సీజన్ పోటీలు జరుగుతాయని చెప్పారు. ఫార్ములా-ఈ వేదికలకు ఏఫ్ఐఏ వరల్డ్ మోటర్ స్పోర్ట్ కౌన్సిల్ గురువారం ఆమోదముద్ర వేసింది. దీంతో మరోమారు రేసింగ్ అభిమానులు కార్ల వేగాన్ని ఆస్వాదించే అవకాశం లభించింది. గత కొన్ని రోజులగా హైదరాబాద్ ఆతిథ్యంపై వస్తున్న నిరాధార వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
ఈ ఫార్ములా రేసింగ్ కు విపరీతమైన క్రేజ్
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా-ఈ రేసును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దేశంలో తొలిసారి జరిగిన ఈ పోటీలను మంత్రి కేటీఆర్ దగ్గరుండి అన్నీ తానై వ్యవహరించారు. ఈ క్రమంలో ఫార్ములా- ఈ నిర్వాహకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇదిలా ఉండగా.. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రిస్తూ ఎలక్ట్రిక్ కార్లతో రూపుదిద్దుకున్న ఫార్ములా ఈ రేసింగ్ కు విపరీతమైన క్రేజ్ లభిస్తోంది.