LOADING...
Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 529 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 529 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 529 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 12, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 13, 2026 నుంచి ప్రారంభం కానుంది. స్టాఫ్ నర్సు పోస్టులతో పాటు మరో 24 ఫార్మసిస్ట్ పోస్టులు, 86 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. దీంతో మొత్తం 529 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

వివరాలు

జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి

ఎంపికైన అభ్యర్థులను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCలు), ప్రభుత్వ ఆసుపత్రులు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (NICUలు), జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లు తదితర విభాగాల్లో నియమించనున్నారు. ఈ నియామక ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. జూన్ 11న విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2026 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ నిబంధనలు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలని అధికారులు సూచించారు.

Advertisement