Page Loader
Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ ఛైర్మన్
గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ ఛైర్మన్

Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ ఛైర్మన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపు ఉండదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ స్పష్టం చేశారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ టారిఫ్‌లను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ విభాగంలోనూ విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదని ఆయన ప్రకటించారు. సాధారణంగా టారిఫ్‌ల ప్రకటనను మార్చి 31లోపు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, ఈసారి ముందుగానే ఫిబ్రవరిలోనే ప్రకటిస్తున్నామని తెలిపారు.