Sabarimala Prasadam: గుడ్ న్యూస్.. శబరిమల అరవణ ప్రసాదం ఇప్పుడు మీ ఇంటికే హోం డెలివరీ!
ఈ వార్తాకథనం ఏంటి
శబరిమలలో మకరవిళక్కు పూజా సీజన్ మొదలవడంతో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకూ భారీగా పెరుగుతోంది. భారీ రద్దీని నియంత్రించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. భక్తుల సంఖ్యను బట్టి స్పాట్ బుకింగ్ టోకెన్లను పెంచడం, తగ్గించడం వంటి చర్యలు కూడా కొనసాగుతున్నాయి. సాధారణంగా శబరిమల అయ్యప్ప ఆలయంలో అరవణ పాయసం, అప్పం వంటి ప్రసాదాలు ప్రత్యేకంగా ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ ప్రసాదం పొందడానికి శబరిమల వెళ్లాల్సిన అవసరం లేకుండా, దేశంలో ఎక్కడ ఉన్న భక్తులైనా పోస్టాఫీసుల ద్వారా ప్రసాదాన్ని ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనికోసం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు పోస్టల్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పని చేస్తోంది.
Details
ప్రసాద కిట్‌లో ఏముంటుంది?
శబరిమల ఆలయాన్ని వ్యక్తిగతంగా దర్శించలేని భక్తుల కోసం, శబరిమల పోస్టాఫీస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీసుల నుంచి అయ్యప్ప ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ ప్రత్యేక ప్రసాద కిట్‌లో ఇవి ఉంటాయి నెయ్యి అరవణ పాయసం పసుపు కుంకుమ విభూతి అరచనై ప్రసాదం శబరిమల పోస్టాఫీస్ అధికారులు మాట్లాడుతూ - "భారతదేశంలోని ప్రతి అయ్యప్ప భక్తుడికి శబరిమల ప్రసాదం అందేలా చేయడం మా లక్ష్యం. అందుకోసం పోస్టల్ విభాగం ఇంటికే డెలివరీ ప్రాజెక్టును ప్రారంభించిందని తెలిపారు.
Details
ప్రసాదం ధరలు (పోస్టాఫీసుల ద్వారా బుకింగ్)
1 టిన్ అరవణ కిట్ - ₹520 4 టిన్లు అరవణ కిట్ - ₹960 10 టిన్లు అరవణ కిట్ - ₹1,760 పోస్టాఫీసులో చెల్లింపు జరిపిన తర్వాత కొద్ది రోజుల్లోనే శబరిమల నుంచి ప్రసాదం నేరుగా ఇంటికే చేరుతుంది. మకరవిళక్కు పూజ పూర్తయ్యాక కొన్ని రోజుల్లో అయ్యప్ప ఆలయం మూసివేయబడుతుంది. ఆలయం మూసిన తర్వాత శబరిమల పోస్టాఫీస్ కూడా లాక్ అవుతుంది. ఆ సమయంలో వచ్చిన పార్సిళ్లను భద్రంగా భద్రపరుస్తారు.