LOADING...
Singareni Workers: సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎంతంటే? 
సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎంతంటే?

Singareni Workers: సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎంతంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సర్కారు సింగరేణి కార్మికులకు బోనస్‌ను ప్రకటించింది. గత సంవత్సరం 33 శాతం వాటాను కార్మికులకు అందించిన విషయం తెలిసిందే. ఈసారి ప్రతి ఉద్యోగికి రూ.1,95,610 బోనస్‌గా ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మొత్తం రూ.819 కోట్లను సింగరేణి ఉద్యోగులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. "సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాణాధారంలాంటిది. ఇది కేవలం బొగ్గు గనుల సంస్థ మాత్రమే కాదు, ఉద్యోగాలకూ పెద్ద ఆధారం. సంస్థను సమర్థంగా నడిపిస్తున్న యాజమాన్యాన్ని అభినందించాలి" అని అన్నారు.

వివరాలు 

71 వేల మంది ఉద్యోగులు

అలాగే సింగరేణిలో ప్రస్తుతం అన్ని విభాగాల్లో కలిపి సుమారు 71 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన వివరించారు. కోల్ ఇండియాలో లేని అనేక రకాల భత్యాలను (అలవెన్సులు) తెలంగాణలోని సింగరేణి కార్మికులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ.. "గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల బాట పట్టించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఈ సంస్థ మొత్తం రూ.6,394 కోట్ల లాభాలను సాధించింది" అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం