LOADING...
Hyderabad: మెట్రో-క్యాబ్‌లకు గుడ్‌బై.. ఐటీ ఉద్యోగుల కోసం నేరుగా బస్సు సేవలు
మెట్రో-క్యాబ్‌లకు గుడ్‌బై.. ఐటీ ఉద్యోగుల కోసం నేరుగా బస్సు సేవలు

Hyderabad: మెట్రో-క్యాబ్‌లకు గుడ్‌బై.. ఐటీ ఉద్యోగుల కోసం నేరుగా బస్సు సేవలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2025
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

హయత్‌నగర్, ఎల్‌.బి.నగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో నివసించే ఐటీ ఉద్యోగులకు శుభవార్త. ఇకపై ద్విచక్ర వాహనాలు వదిలేసి నేరుగా బస్సెక్కి కార్యాలయాలకు చేరుకునే అవకాశం లభించింది. మెట్రో, క్యాబ్‌లు మారుతూ వెళ్లే తలనొప్పికి ముగింపు పలుకుతూ, గమ్యం వరకు నేరుగా చేరేలా ఆర్టీసీ రెండు కొత్త బస్సు మార్గాలను ప్రవేశపెట్టింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని 'గర్‌లక్ష్మీ ఇన్ఫోబాన్' పేరుతో 156/316, 300/316 రూట్ బస్సులను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సు సర్వీసులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు నడుస్తాయి. కొత్త సర్వీసుల ప్రారంభంతో సుమారు 40 ప్రాంతాల్లో నివసించే వారికి మెరుగైన ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు.

Details

ఐటీ కారిడార్‌పై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి

156/316 మార్గం ఈ రూట్‌లో బస్సు ఎల్‌.బి.నగర్ నుంచి కోఠి, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్, నార్సింగి ఎక్స్‌రోడ్, కోకాపేట క్రాస్‌రోడ్, గర్, కాంటినెంటల్ సర్కిల్, ఐసీఐసీఐ సర్కిల్, ఐఐఐటీ మీదుగా గచ్చిబౌలికి చేరుకుంటుంది. 300/316 మార్గం హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్, సాగర్ క్రాస్‌రోడ్, పిసల్‌బండ, పూల్‌బాగ్, అస్మాబాద్, బండ్లగూడ, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, వీకర్‌సెక్షన్ కాలనీ, ఉప్పర్‌పల్లి క్రాస్‌రోడ్, హైదర్‌గూడ క్రాస్‌రోడ్ లంగర్‌హౌజ్, టీకే బ్రిడ్జి, తారామతి, నార్సింగి, కోకాపేట సర్కిల్, గర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వేవ్‌రాక్, ఐసీఐసీఐ జంక్షన్, విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్, ఐఐఐటీ మీదుగా గచ్చిబౌలికి చేరుకుంటుంది.

Details

వేగవంతమైన ప్రయాణానికి భరోసా

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త బస్సు సేవలను ప్రవేశపెట్టామని హైదరాబాద్ రీజనల్ మేనేజర్ సుధా పరిమళ తెలిపారు. ఈ కొత్త మార్గాలు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఐటీ కారిడార్ గణాంకాలు ఐటీ కారిడార్‌లో నడుస్తున్న బస్సులు:500 వీటిలో ఎలక్ట్రిక్ బస్సులు: 200 త్వరలో రాబోయే కొత్త ఎలక్ట్రిక్ బస్సులు: 275 ఐటీ కారిడార్‌లో వాహనాల సగటు వేగం: గంటకు 12 నుంచి 15 కి.మీ రద్దీ సమయాలు: ఉదయం 8-11గంటలు, సాయంత్రం 5-రాత్రి 8 గంటలు రద్దీ సమయాల్లో వాహనాలు బారులు తీరే దూరం: సుమారు 1.8 కి.మీలు ఈ కొత్త బస్సు సర్వీసులతో ఐటీ ఉద్యోగుల రోజువారీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.

Advertisement