Page Loader
Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు
Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు

Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు

వ్రాసిన వారు Stalin
Feb 25, 2024
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

Goods train ran without driver: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఓ గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండా 84 కిలోమీటర్లు నడిచింది. ఆ సమయంలో రైలు గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం గమనార్హం. చిప్‌ స్టోన్లతో నిండిన 53 వ్యాగన్లతో కూడిన గూడ్స్ రైలు లోకో పైలెట్ లేకుండానే జమ్ముకశ్మీర్‌ నుంచి పంజాబ్‌లోని ఓ గ్రామం వరకు అలాగే వెళ్లింంది. కొన్ని చోట్ల ఈ రైలు గంటకు 100 కి.మీ వేగంతో కూడా వెళ్లినట్లు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. జమ్మకశ్మీర్‌ నుంచి పంజాబ్‌కు వస్తున్న ఈ రైలు మార్గమధ్యలో కథువా స్టేషన్‌లో ఆగింది. ఇక్కడ డ్రైవర్‌ ఛేంజ్‌ కావాల్సి ఉంది.

రైలు

ఇసుక బస్తాలు సాయంతో రైలును ఆపిన రైల్వే సిబ్బంది

కథువా స్టేషన్‌లో రైలు హ్యాండ్‌ బ్రేక్‌ వేయకుండానే డ్రైవర్లు దిగిపోయారు. ఈ క్రమంలో డ్రైవర్లు దిగిపోగానే రైలు మెల్లగా పట్టాలపై పరుగులు పెట్టింది. పట్టాలు వాలుగా ఉండటంతో రైలు వేగం మరింత పుంజుకొంది. సుమారుగా అది 78కి.మీ మేర అలాగే ప్రయాణించింది. అయితే రైల్వే అధికారులు గూడ్స్ రైలును నిలువరించే ప్రయత్నం చేసినా.. ఫలించలేదు. ఆఖరికి పంజాబ్‌ హోషియార్‌పుర్‌ జిల్లాలోని రైలు ఆగిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టాలపై ఇసుక బస్తాలు సాయంతో రైలును ఆపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డ్రైవర్ లేకుండానే దూసుకెళ్తున్న రైలు