Vistara Flights: విస్టార విమానాల రద్దు, ఆలస్యాలపై నివేదిక కోరిన కేంద్ర ప్రభుత్వం
విస్తారా సంస్థకు చెందిన విమానాల రద్దు, ఆలస్యాలపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పూర్తి నివేదికను ఇవ్వాలని ఆ సంస్థను ఆదేశించింది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్తో కలసి విమానాలను నడుపుతున్న విస్టార గతవారం 100 కు పైగా విమానాలు ఆలస్యం చేయడంతోపాటు సర్వీసులను కూడా రద్దు చేసింది. విమానప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా తరచూ విమానాల ఆలస్యం,రద్దును నివారించేందుకు తమ సిబ్బంది కృషి చేస్తుందని విస్టార సంస్థ స్పష్టం చేసింది. సాంకేతిక కారణాల వల్లే సర్వీసులను చేసినట్లు సంస్థ వెల్లడించింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తోందని పేర్కొంది. ఇబ్బందులు పడిన ప్రయాణికులకు విస్టార సంస్థ క్షమాపణలు తెలిపింది.
తాత్కాలికంగా సర్వీసుల తగ్గింపు
విస్తారా నెట్వర్క్ అంతటా తగిన కనెక్టివిటీని నిర్థారించేందుకు విమానాల సర్వీసులను తాత్కాలికంగా తగ్గించివేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సెలెక్ట్ చేసిన దేశీయ రూట్లలో బీ787-9 డ్రీమ్ లైనర్, ఏ 321 నియో వంటి లార్జ్ ఎయిర్ క్రాప్ట్లను కూడా నియోగించినట్లు సంస్థ వెల్లడించింది. విమానాలు ఆలస్యం, రద్దు కారణాలతో ఇబ్బందులు పడిన ప్రయాణికులకు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా తిరిగి ప్రయాణ చార్జీలు చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు విస్టార సంస్థ ప్రకటించింది. మరోసారి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు విస్టార సంస్థ మన:స్పూర్తిగా క్షమాపణలు కోరింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు తమ సిబ్బంది పనిచేస్తున్నట్లు వెల్లడించింది.